Surya ET Movie: రాధేశ్యామ్‌కి పోటీగా ఈటీ.. సూర్య నమ్మకం ఏంటో?

రాధేశ్యామ్ కంటే ఒకరోజు ముందే వచ్చేస్తా అంటున్నారు సూర్య. ఈ హీరో లేటెస్ట్ ఫిల్మ్ ఈటీ మార్చ్ 10న రిలీజ్ కాబోతుంది. అయితే ఓటీటీలో ఓకే.. హిట్స్ ఇచ్చారు సూర్య.. కానీ సింగం3 తర్వాత..

Surya ET Movie: రాధేశ్యామ్‌కి పోటీగా ఈటీ.. సూర్య నమ్మకం ఏంటో?

Surya Et Movie

Surya ET Movie: రాధేశ్యామ్ కంటే ఒకరోజు ముందే వచ్చేస్తా అంటున్నారు సూర్య. ఈ హీరో లేటెస్ట్ ఫిల్మ్ ఈటీ మార్చ్ 10న రిలీజ్ కాబోతుంది. అయితే ఓటీటీలో ఓకే.. హిట్స్ ఇచ్చారు సూర్య.. కానీ సింగం3 తర్వాత థియేటర్ హిట్ లేని ఈ స్టార్.. ఈటీతో ఆ ఫీట్ సాధిస్తారా.. అసలు రౌడీబాయ్ రిలీజ్ చేసిన ఈటీ ట్రైలర్ ఎలా ఉంది.

Suriya : సూర్య ’24’ సినిమాకి సీక్వెల్.. త్వరలో ప్రకటన..

సూర్య ఈటీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు వర్షన్ ను ఆన్ లైన్ లో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు. డిఫరెంట్ షేడ్స్ లో సూర్య కనిపించిన ఈ ట్రైలర్ ను మంచి డెప్త్ తో కట్ చేశారు మేకర్స్. డైరెక్టర్ పాండిరాజ్ తన రెగ్యులర్ స్టైల్ నే ఫాలో అయనట్టు అనిపించినా ఈసారి అర్బన్ డ్రామాను చూపిస్తూ థియేటర్ కెళ్లొచ్చనే నమ్మకాన్ని కలిగించారు. మార్చ్ 11న రాధేశ్యామ్ వస్తుంటే.. మార్చ్ 10న ఈటీని తీసుకొస్తున్నారంటే మూవీ యూనిట్ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందో అర్దం చేసుకోవచ్చు.

Suriya – Karthi : సీఎం స్టాలిన్‌ను కలిసి కోటి విరాళమందించిన సూర్య ఫ్యామిలీ..

ప్రీవియస్ మూవీస్ ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలు సూర్యకి బాగా కలిసొచ్చాయి. కొవిడ్ టైమ్ లో ఈ రెండు సినిమాలతో సూర్య నేషనల్ వైడ్ పాపులరయ్యారు. అయితే ఇవి ఓటీటీ బ్లాక్ బస్టర్స్. థియేటర్ లో సూర్య సక్సెస్ సాధించి చాలా కాలమే అవుతోంది. సింగం3 తర్వాత సూర్య లిస్ట్ లో మాక్సిమమ్ అన్నీ ఫ్లాప్సే ఉన్నాయి. ఎన్జీకే, బందోబస్ట్ లాంటి సినిమాలను తెలుగు ఆడియెన్స్ పూర్తిగా తిప్పిగొట్టారు. అయినా సరే ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ ఇచ్చిన క్రేజ్ తో ఈటీపై నమ్మకం పెట్టుకున్నారు సూర్య.

Suriya : సూర్యకు బెదిరింపులు.. సూర్య ఇంటి వద్ద భద్రత

గజిని నుంచి సూర్యని తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ప్రయోగాలు చేస్తే మొచ్చుకున్నారు. ఎప్పుడైతే కంటెంట్ లేని రోటీన్ ఫార్ములాతో వచ్చారో సూర్యకు డిజాస్టర్ లిచ్చారు. అందుకే ఈసారి ఈటీతో ఊర మాస్ లుక్ లో సూర్య ఆకట్టుకుంటానంటున్నారు. బ్రదర్స్ తర్వాత ఈటీలో తన రోల్ కి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇప్పటికే రిలీజైన లిరికల్ సాంగ్స్, టీజర్స్ కూడా ఒకే అనిపించాయి. మరి తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈటీ సూర్యకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.