Suriya – Karthi : సీఎం స్టాలిన్‌ను కలిసి కోటి విరాళమందించిన సూర్య ఫ్యామిలీ..

సీనియర్ తమిళ్ నటుడు శివ కుమార్, తన ఇద్దరు కొడుకులు అయిన తమిళ స్టార్స్ సూర్య, కార్తి, సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ డెరెక్టర్ రాజశేఖర్ పాండియన్‌లతో కలిసి కోవిడ్ నివారణకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక కోటి రూపాయళ విరాళమందించారు..

Suriya – Karthi : సీఎం స్టాలిన్‌ను కలిసి కోటి విరాళమందించిన సూర్య ఫ్యామిలీ..

Suriya And Karthi Donated Rs 1 Crore To Tamilnadu Cm Relief Fund

Suriya – Karthi: కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని వణికిస్తోంది.. రోజురోజుకీ తీవ్ర ప్రభావం చూపిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోంది.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గడం లేదు.. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులో ఉన్నవారికి అవసరమైన ప్లాస్మా, ఆక్సిజన్, మెడిసిన్స్‌, హాస్పిటల్ బెడ్స్ వంటి పలు సౌకర్యాలను అందిస్తూ సోనూ సూద్ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయనలానే మరికొంత మంది సెలబ్రిటీలు తమ వంతు సాయమందించడానికి ముందుకొస్తున్నారు..

Suriya - Karthi

తాజాగా సీనియర్ తమిళ్ నటుడు శివ కుమార్, తన ఇద్దరు కొడుకులు అయిన తమిళ స్టార్స్ సూర్య, కార్తి, సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ డెరెక్టర్ రాజశేఖర్ పాండియన్‌లతో కలిసి కోవిడ్ నివారణకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక కోటి రూపాయళ విరాళమందించారు.

Suriya - Karthi

ఈ మేరకు డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ఆయన ఆఫీసులో కలిసి చెక్కు అందచేశారు. కరుణానిధి తర్వాత ఇటీవల డీఎంకే పార్టీ అధికారంలోకి రావడం, స్టాలిన్ సీఎం కావడంతో మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. కరోనా బాధితులకు అండగా నిలబడడం కోసం మంచి మనసుతో ముందుకొచ్చిన శివ కుమార్, సూర్య, కార్తిలను స్టాలిన్ అభినందించారు..

 

Suriya - Karthi