NTR – Ram Charan : ‘సీటూ హీటెక్కుతుంది.. బ్రెయినూ హీటెక్కుతుంది’..

‘ఎవరు మీలో కోటీశ్వరులు’.. కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు..

NTR – Ram Charan : ‘సీటూ హీటెక్కుతుంది.. బ్రెయినూ హీటెక్కుతుంది’..

Ntr Ram Charan

NTR – Ram Charan: మెగా – నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మెమరబుల్ మూమెంట్ మరికొద్ది రోజుల్లో రాబోతోంది. ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి సందడి చేసిన ప్రోమో వదిలారు మేకర్స్.

RRR UK Schedule : ఎండ్ కొచ్చేసరికి ఎనర్జీ ట్రిపుల్ అయ్యిందిగా..

‘వస్తున్నా.. ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా.. సోమవారం నుంచి గురువారం వరకు.. ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’.. మీ జెమిని టీవీలో.. అంటూ వదిలిన రివీలింగ్ ప్రోమో వైరల్ అవుతోంది. ఆగస్టు 22 రాత్రి 8:30 గంటలకు కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌తో ఈ క్రేజీ రియాలిటీ షో స్టార్ట్ కానుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు.

Evaru MeeloKoteeswarulu : ‘వస్తున్నా.. ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా’..

ఈ మేరకు విడుదల చేసిన ప్రోమో తెగ వైరల్ అవడమే కాక ఇరు హీరోల అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ‘సీటూ హీటెక్కుతుంది.. బ్రెయినూ హీటెక్కుతుంది’ అంటూ చరణ్ టెన్షన్ పడడం, తారక్ అతనితో కలిసి సందడి చెయ్యడంతో ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఆగస్టు 23 నుండి సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో టెలికాస్ట్ కానుంది.

Evaru Meelo Koteeswarulu: బుల్లితెరపై ఆర్ఆర్.. ఎవరు మీలో కోటీశ్వరులు ఫస్ట్ గెస్ట్ ఎవరంటే?

చెర్రీ, తారక్ ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ – రౌద్రం రణం రుధిరం.. దర్శకధీరుడు రాజమౌళి తారక్‌ని కొమరం భీం, చరణ్‌ని అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లలో చూపించబోతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది.