F3: ఎఫ్3 రెస్పాన్స్‌పై చిత్ర యూనిట్ హ్యాపీ!

టాలీవుడ్‌లో రిలీజ్ అయిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఎఫ్3’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి...

F3: ఎఫ్3 రెస్పాన్స్‌పై చిత్ర యూనిట్ హ్యాపీ!

F3 Movie Team Happy With Movie Success

F3: టాలీవుడ్‌లో రిలీజ్ అయిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఎఫ్3’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన స్టైల్‌లో తెరకెక్కించగా, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా నటించారు. ఇక ఈ సినిమాను ఎఫ్2 సినిమాకు సీక్వెల్‌గా తీసుకురావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

తాజాగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాకు తాము అనుకున్నట్లుగా రెస్పాన్స్ వస్తుండటంతో ఎఫ్3 చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ మీడియాతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘మా అంచనా ఎలా ఉందో.. అన్ని ఏరియాల్లో నుండి సేమ్ రిపోర్ట్ వచ్చింది.. ఎఫ్3 బిగ్గర్ దెన్ ఎఫ్2.. నిజమైన సమ్మర్.. సక్సెస్‌ఫుల్ మూవీస్ చేసిన అనిల్ రావిపూడికి థాంక్స్’’ అంటూ దిల్ రాజు తన సంతోషాన్ని వెల్లడించాడు.

F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి

అటు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ను చూసి..‘‘సింగిల్ టాక్.. ఎనీసెంటర్ సూపర్ టాక్.. సినిమా చుసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసారు..రాజు గారికి పెద్ద హగ్ ఇచ్చాను..థియేటర్‌లో సందడి మాములుగా లేదు.. వరుణ్, వెంకటేష్ ఇద్దరు బాగా చేశారు.. శుక్రవారం వస్తే ప్రతి సినిమా గురించి మాట్లాడుకుంటారు.. నెగిటివ్ ఎందుకు? పాజిటివ్ మైండ్‌తో ఉందాం..’’ అంటూ చెప్పకొచ్చాడు.

ఇక హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘అందరికీ థాంక్స్.. నాది వెంకీది బెస్ట్ కెమిస్ట్రీ అయ్యిందని.. మా అమ్మనాన్నలతో పాటు అందరూ ఫోన్ చేసి చెప్పారు..’’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇక మరో హీరో వెంకటేష్ మాట్లాడుతూ..‘‘సినిమా బాగా రిసీవ్ చేసుకున్నందుకు అందరికీ థాంక్స్.. ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు.. అనిల్ బాగా చేశాడు.. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ రావాలి..’’ అని అన్నారు.

F3: ఎఫ్3 ప్రీరిలీజ్ బిజినెస్.. అందుకుంటే ఫన్.. లేకపోతే ఫ్రస్ట్రేషన్!

కాగా.. ఎఫ్3 చిత్రంలో ఎఫ్2 సినిమాలోని మెజారిటీ యాక్టర్స్ నటించగా, కొత్తగా సునీల్, సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, సంపత్ రాజ్‌లు ఈ సినిమాలో కనిపించారు. ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా వసూళ్ల పరంగా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.