F3: ఎఫ్3 ప్రీరిలీజ్ బిజినెస్.. అందుకుంటే ఫన్.. లేకపోతే ఫ్రస్ట్రేషన్!

టాలీవుడ్‌లో తెరకెక్కిన ఎఫ్2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కడుపుబ్బా....

F3: ఎఫ్3 ప్రీరిలీజ్ బిజినెస్.. అందుకుంటే ఫన్.. లేకపోతే ఫ్రస్ట్రేషన్!

F3 Makes Stunning Worldwide Pre Release Business

F3: టాలీవుడ్‌లో తెరకెక్కిన ఎఫ్2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా సాధించిన భారీ విజయంతో, ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌ను ఎప్పుడెప్పుడు రెడీ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. కాగా ఎఫ్3 చిత్రాన్ని తాజాగా అనిల్ రావిపూడి అండ్ టీమ్ రిలీజ్‌కు రెడీ చేశారు. ఈ సినిమాలో కూడా ఎఫ్2 మూవీలోని మెజారిటీ యాక్టర్స్ నటిస్తుండటంతో ఈ సీక్వెల్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

F3: ఎఫ్3 సెన్సార్ రిపోర్ట్.. సమ్మర్‌లో చిల్ కావడం ఖాయం!

ఇక ఈ మూవీపై నెలకొన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఉండటంతో ఎఫ్3 మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలుస్తుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హక్కులను వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.80 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.

F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!

అయితే ఓ మీడియం బడ్జెట్ మూవీకి ఈ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం నిజంగా విశేషమని చెప్పాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా చేసిన ప్రీరిలీజ్ బిజినెస్‌ను థియేట్రికల్ రన్‌లో అందుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్‌లు ముఖ్య పాత్రల్లో నటించగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏరియాల వారీగా ఎఫ్3 చిత్రం చేసిన ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 22.5 కోట్లు
సీడెడ్ – 10.8 కోట్లు
వైజాగ్ – 7.8 కోట్లు
ఈస్ట్ – 5.1 కోట్లు
వెస్ట్ – 4.5 కోట్లు
కృష్ణా – 4.5 కోట్లు
గుంటూరు – 5.4 కోట్లు
నెల్లూరు – 2.4 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 63 కోట్లు
కర్ణాటక – 4.5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2 కోట్లు
ఓవర్సీస్ – 7 కోట్లు
P&P – 3.5 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్ – 80 కోట్లు