F3 Movie : F3 సినిమా మూడు రోజుల కలెక్షన్స్..

గత రెండు రోజులు శని, ఆది వీకెండ్ కావడంతో కలెక్షన్లు పుంజుకున్నాయి. F3 సినిమా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఇవే...............

F3 Movie : F3 సినిమా మూడు రోజుల కలెక్షన్స్..

F3 Collections (1)

F3 Movie :  వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా మెహరీన్, తమన్నా, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ F3 సినిమా. మే 27న రిలీజైన్ ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరై విజయం సాధించింది. గత రెండు రోజులు శని, ఆది వీకెండ్ కావడంతో కలెక్షన్లు పుంజుకున్నాయి. F3 సినిమా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఇవే..

నైజాం – 12.20 కోట్లు

సీడెడ్ – 3.59 కోట్లు

ఉత్త‌రాంధ్ర – 3.32కోట్లు

ఈస్ట్ – 1.88 కోట్లు

వెస్ట్ – 1.54 కోట్లు

గుంటూరు – 2.06 కోట్లు

కృష్ణా – 1.77 కోట్లు

నెల్లూరు – 1.15 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో 27 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లని సాధించింది F3 సినిమా.

రెస్టాఫ్ ఇండియా – 1.80 కోట్లు

ఓవ‌ర్సీస్ – 5.20 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

Srinidhi Shetty : నాకు డబ్బే కావాలి అంటున్న KGF హీరోయిన్.. రెమ్యునరేషన్ కూడా పెంచేసి..

మొత్తంగా మూడు రోజుల‌కు 34 కోట్లకు పైగా షేర్ క‌లెక్ష‌న్స్ సాధించగా, 60కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది F3 సినిమా. ఈ సినిమాకు 63.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 64 కోట్లకు పైగా రాబట్టాలి. ఇప్పటికి 34 కోట్లు రాబట్టగా ఇంకో 30 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు వస్తే F3 హిట్ అయినట్టే. నెక్స్ట్ మేజర్ సినిమా రావడానికి ఇంకో 4 రోజులు టైం ఉండటంతో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు చిత్ర యూనిట్.