F3: మరో సీక్వెల్ రెడీ అంటోన్న అనిల్ రావిపూడి..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సీక్వెల్ చిత్రాల్లో ‘ఎఫ్3’ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి...

F3: మరో సీక్వెల్ రెడీ అంటోన్న అనిల్ రావిపూడి..?

F3 Movie To Have Another Sequel Says Anil Ravipudi

F3: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సీక్వెల్ చిత్రాల్లో ‘ఎఫ్3’ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఎఫ్3 సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో వచ్చిన ఎఫ్2 చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్3 కోసం ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు.

F3: ‘ఊ ఆ ఆహా ఆహా..’ లిరికల్ సాంగ్.. అదరగొట్టిన దేవిశ్రీ!

ఎఫ్2లో భార్యల చుట్టూ కథ సాగితే, ఎఫ్3లో డబ్బు చుట్టూ కథ సాగనుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. అయితే ఈ సినిమాను వేసవి కానుకగా మే 27న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా రిలీజ్ కాకముందే, ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఎఫ్3 సినిమా పూర్తికాకముందే, ఈ సినిమాకు మరో సీక్వెల్ కథను కూడా అనిల్ రావిపూడి రెడీ చేసినట్లు తెలుస్తోంది.

F3: రొమాంటిక్ సాంగ్‌తో ఊపేశారుగా!

అయితే ఎఫ్3 మూవీని ప్రేక్షకులు ఆదరిస్తే, వెంటనే ఎఫ్4 సినిమాను మొదలుపెట్టేందుకు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ ఎఫ్3కి నెగెటివ్ రిజల్ట్ వస్తే, కొంత గ్యాప్ తీసుకున్న తరువాతే ఎఫ్4 చిత్రాన్ని పట్టాలెక్కించాలని అనిల్ రావిపూడి నిర్ణయించుకున్నాడట. ఏదేమైనా ఎఫ్3 ఇంకా రిలీజ్ కాకముందే, అప్పుడే ఎఫ్4 గురించి ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.