F3: ‘ఊ ఆ ఆహా ఆహా..’ లిరికల్ సాంగ్.. అదరగొట్టిన దేవిశ్రీ!

టాలీవుడ్‌లో తెరకెక్కిన ఎఫ్2 సినిమా ప్రేక్షకులను ఎలా అలరించిందో మనందరికీ తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీకి ప్రేక్షకులు....

F3: ‘ఊ ఆ ఆహా ఆహా..’ లిరికల్ సాంగ్.. అదరగొట్టిన దేవిశ్రీ!

Woo Aaa Aha Aha Lyrical Song From F3 Instant Hit

F3: టాలీవుడ్‌లో తెరకెక్కిన ఎఫ్2 సినిమా ప్రేక్షకులను ఎలా అలరించిందో మనందరికీ తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీకి ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ అందించారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా సాధించిన సక్సెస్‌తో ఈ సినిమాకు సీక్వెల్‌ను ఖచ్చితంగా తెరకెక్కిస్తానని దర్శకుడు అనిల్ రావిపూడి అప్పట్లోనే ప్రకటించాడు.

F3: రొమాంటిక్ సాంగ్‌తో ఊపేశారుగా!

ఇప్పుడు ఆయన అన్నట్లుగానే ఎఫ్2 సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాను వేసవి కానుకగా మే 27న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను అప్పుడే చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఎఫ్3 సినిమాలోని రెండో లిరికల్ సాంగ్‌గా ‘‘ఊ ఆ ఆహా ఆహా’’ అనే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్‌ను అందించాడు.

F3: ఎఫ్3 నుండి సెకండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్!

చాలా రోజుల తరువాత టాలీవుడ్‌లో ఈ తరహా పాట వినిపించడంతో ఆడియెన్స్ ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్‌లు ఈ పాటలో అందాల ఆరబోతతో తమ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారని చెప్పాలి. ఈ సినిమాలో ఎఫ్2 లోని దాదాపు అందరు నటీనటులు నటిస్తుండగా.. సునీల్, సోనాల్ చౌహాన్ కొత్తగా యాడ్ అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.