Summer AC Home Tips : కొత్త AC కొంటున్నారా? ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఏది బెస్ట్? ఫుల్ డిటెయిల్స్!
Summer AC Home Tips : కొత్త ఏసీ కొంటున్నారా? ఇన్వర్టర్ లేదా నాన్-ఇన్వర్టర్ ఎంచుకోవాలా? ఎందులో తక్కువ పవర్, కూలింగ్ ఎక్కువగా ఉంటుంది? బెనిఫిట్స్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
Summer AC Home Tips ( Image Credit : Gemini AI )
- ఈ సమ్మర్లో ఇన్వర్టర్ ఏసీ కొనాలా? నాన్-ఇన్వర్టర్ ఏసీ కొనాలా?
- కొత్త ఏసీ కొనేముందు ఏది తీసుకుంటే బెటర్?
- పవర్ వినియోగం, సౌండ్ తక్కువ, ఎందులో ఖర్చులు తక్కువంటే?
Summer AC Home Tips : అయ్య బాబోయ్ ఎండలు దంచేస్తున్నాయి. బయటకు రావాలంటే వణుకు పుడుతోంది. ఇంట్లో కాసేపు ఏసీ లేకపోతే ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకే ఈ సమ్మర్లో ఏసీలు తెగ వాడేస్తుంటారు. మీరు కూడా కొత్త ఏసీ తీసుకోవాలని చూస్తున్నారా? కాస్త ఆగండి.. ఇంతకీ ఏ ఏసీ మీ ఇంటికి బెటర్? ఆలోచించారా? అందులోనూ ఇన్వర్టర్ ఏసీ కొనాలా? లేదా నాన్-ఇన్వర్టర్ ఏసీ కొనాలా? అనేదే అతిపెద్ద ప్రశ్న.
ఈ రెండింటికీ వేర్వేరు ధరలు, పవర్ వినియోగం, పనిచేసే పద్ధతులు ఉంటాయి. ఇందులో ఏ ఏసీ తీసుకుంటారంటే? ప్రస్తుతం చాలామంది ఇన్వర్టర్ ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే.. కొత్త టెక్నాలజీతో పనిచేస్తాయి. తక్కువ పవర్ వినియోగిస్తాయి.
మరోవైపు, నాన్-ఇన్వర్టర్ ఏసీ పాత టెక్నాలజీకి చెందినది. కానీ, మన్నిక, ఈజీగా రిపేరింగ్ చేయొచ్చు. చాలా మంది నాన్ ఇన్వర్టర్ ఏసీని తీసుకుంటారు.. మీరు ఈ సమ్మర్లో ఎలాంటి తీసుకుంటే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏ ఏసీకి తక్కువ పవర్? :
ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇన్వర్టర్ ఏసీ అవసరాన్ని బట్టి కంప్రెసర్ స్పీడ్ అడ్జెస్ట్ చేసుకోగలదు. గది కూలింగ్ కాగానే స్పీడ్ తగ్గి తక్కువ పవర్ వినియోగిస్తుంది. నాన్-ఇన్వర్టర్ ఏసీల విషయంలో ఇలా ఉండదు. కంప్రెసర్లు పూర్తి పవర్‌తో నడుస్తాయి లేదా పూర్తిగా ఆగిపోతాయి.
Read Also : Home Loan Documents : లోన్ పెట్టి ఇల్లు కొన్నారా? మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు బ్యాంక్ పోగొడితే..!
అందుకే నాన్-ఇన్వర్టర్ ఏసీలు ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. నివేదికల ప్రకారం.. ఒక ఇన్వర్టర్ ఏసీలోని కంప్రెసర్‌ను 40 శాతం, 60 శాతం, లేదా 80 శాతం వంటి సామర్థ్యాలతో నడపవచ్చు. తద్వారా పవర్ ఆదా అవుతుంది. అయితే, మీ ఏసీని ప్రతిరోజూ ఎక్కువగ గంటల పాటు నడిపితే ఇన్వర్టర్ ఏసీ మీ పవర్ బిల్లును భారీగా తగ్గిస్తుంది.
కూలింగ్, సౌండ్ విషయంలో ఏది బెటర్? :
ఇక కూలింగ్, సౌండ్ విషయానికి వస్తే.. రెండు ఏసీలూ ఇంటి గదిని కూలింగ్ చేస్తాయి. అదే పెద్ద గదిని ఫాస్ట్ కూలింగ్ చేయాలంటే నాన్-ఇన్వర్టర్ ఏసీ బెటర్. ఎందుకంటే దీనికి ఎక్కువ పవర్ అవసరం. ఇన్వర్టర్ ఏసీ గది టెంపరేచర్ క్రమంగా కంట్రోల్ చేస్తూ ఎక్కువ సేపు కూలింగ్ ఉంచుతుంది.
సౌండ్ విషయానికి వస్తే.. ఇన్వర్టర్ ఏసీ చాలా సైలంట్ ఉంటుంది. కంప్రెసర్ పదేపదే భారీ సౌండ్ చేయదు. మరోవైపు, నాన్-ఇన్వర్టర్ ఏసీ ఆన్, ఆఫ్ అయ్యేటప్పుడు ఎక్కువ సౌండ్ చేస్తుంది. అందుకే సౌండ్ ఇష్టపడని వారు ఇన్వర్టర్ ఏసీని కొనేందుకు ఆసక్తి చూపిస్తారు.
ఏ ఏసీతో ఎక్కువ బెనిఫిట్? :
లాంగ్ టైమ్ కోసం ఏ ఏసీతో బెనిఫిట్ అంటే.. ఇన్వర్టర్ ఏసీలు కచ్చితంగా పవర్ ఆదా చేస్తాయి. కానీ, పీసీబీ (PCB) పాడైపోతే రిపేరింగ్ ఖర్చులు భారీగా ఉండవచ్చు. ఇప్పుడు చాలా కంపెనీలు పీసీబీపై ప్రత్యేకంగా 5 ఏళ్ల వారంటీని అందిస్తున్నాయి.
అదే.. నాన్-ఇన్వర్టర్ ఏసీలలో పాత టెక్నాలజీ ఉంటుంది. స్పేర్ పార్టులు ఈజీగా లభిస్తాయి. రిపేరింగ్ చౌకగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ మీ ఏసీని ఎక్కువ సేపు నడిపితే ఇన్వర్టర్ ఏసీ మీకు బెస్ట్. మీ బడ్జెట్లో పవర్ ఫుల్ ఏసీ కావాలనుకుంటే నాన్-ఇన్వర్టర్ ఏసీ బెస్ట్ ఆప్షన్. మొత్తమ్మీద, పవర్ ఆదా, తక్కువ సౌండ్ కారణంగా ఈ రోజుల్లో ఇన్వర్టర్ ఏసీలకే ఎక్కువ డిమాండ్ ఉంది.
