F3: ఎఫ్3 నుండి సెకండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్!

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ఎఫ్2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి.....

F3: ఎఫ్3 నుండి సెకండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్!

Second Song From F3 To Be Out On This Date

F3: టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ఎఫ్2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా తమన్నా, మెహ్రీన్ పీర్జాదా హీరోయిన్లుగా నటించారు. అయితే పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

F3 Movie: ఎఫ్3 మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే?

ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాలో ఓ హాట్ ఐటెం సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఐటెం సాంగ్‌లో అందాల భామ పూజా హెగ్డే స్పెషల్ అపియరెన్స్ ఇవ్వనుంది. ఇక ఈ సినిమాతో మరోసారి కామెడీ జోనర్ సినిమాల సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేసేందుకు అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను ఇప్పటికే రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, తాజాగా రెండో లిరికల్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది.

F3: ఎఫ్3 సెట్స్‌లో అడుగుపెట్టిన బుట్టబొమ్మ

ఈ సినిమాలోని రెండో సాంగ్‌ను ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ పాటకు సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్‌లతో పాటు మరో బ్యూటీ సోనాల్ చౌహన్ కూడా ఓ తాడును తమవైపుకు లాగుతుంటే, మరోవైపు హీరో వరుణ్ తేజ్ ఒక్కడే తాడును తనవైపుకు లాగుతున్నాడు. కాగా మరో హీరో వెంకటేష్, వరుణ్ తేజ్‌ను ఎంకరేజ్ చేస్తున్నట్లు ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ సెకండ్ సాంగ్ అనౌన్స్‌మెంట్‌తో ఎఫ్3 సినిమాపై అప్పుడే మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక వేసవి కానుకగా ఈ సినిమాను మే 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.