F3: ఎఫ్3 సెట్స్‌లో అడుగుపెట్టిన బుట్టబొమ్మ

ప్రస్తుతం సీక్వెల చిత్రాల హవా జోరుగా సాగుతోంది. ఇప్పటికే బాహుబలి సిరీస్ టాలీవుడ్ సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటగా, ఇప్పుడు కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్ చాప్టర్ 2 బాక్సాఫీస్‌ను.....

F3: ఎఫ్3 సెట్స్‌లో అడుగుపెట్టిన బుట్టబొమ్మ

Pooja Hegde Joins F3 Sets For A Song

F3: ప్రస్తుతం సీక్వెల చిత్రాల హవా జోరుగా సాగుతోంది. ఇప్పటికే బాహుబలి సిరీస్ టాలీవుడ్ సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటగా, ఇప్పుడు కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్ చాప్టర్ 2 బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిస్తోంది. కాగా ఈ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సినిమాలుగా మారడంతో, త్వరలో పట్టాలెక్కనున్న పుష్ప-2 సినిమాపై కూడా నేషన్‌వైడ్‌గా అంచనాలు పెరిగాయి. అయితే ఇవన్నీ పాన్ ఇండియా మూవీలు అవడంతో ఈ సినిమాలు భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. కానీ కేవలం తెలుగులోనే రిలీజ్ అయిన ఎఫ్-2 చిత్రం ఇక్కడి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3 చిత్రం వస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

F3 Movie: ఎఫ్3 మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే?

అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసేందుకు చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ వస్తోంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఇందులో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. వారికి జోడీగా తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో అందాల భామ పూజా హెగ్డే కనిపిస్తుందని చిత్ర వర్గాల్లో ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో పూజా హెగ్డే అడుగుపెట్టడంతో ఇప్పుడు ఈ సినిమాలో ఆమె చేయబోయే స్పెషల్ సాంగ్ ఇంకెంత స్పెషల్‌గా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Pooja Hegde: జిగేలు రాణి ఈజ్ బ్యాక్.. ఎఫ్‌3లో పూజా స్పెషల్ ట్రీట్!

గతంలోనూ పూజా హెగ్డే రామ్ చరణ్‌తో కలిసి ‘రంగస్థలం’ సినిమాలో జిగేలు రాణిగా స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. ఆ పాటకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో, ఇప్పుడు మరోసారి పూజా హెగ్డే స్పెసల్ సాంగ్ కోసం ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేసేందుకు అమ్మడు ఏకంగా రూ.కోటి రెమ్యునరేషన్ వసూలు చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కాగా ఎఫ్3 సెట్స్‌లో పూజా హెగ్డే ఎంట్రీ ఇవ్వడంతో చిత్ర యూనిట్ ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మే 27న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.