Brahmāstra: ఇంతకీ మీ పెళ్ళెప్పుడు.. అలియా రణ్‌బీర్ ఫన్నీ రియాక్షన్!

బాలీవుడ్ ఆడియెన్స్ మోస్ట్ అవైటైడ్ ప్రాజెక్ట్.. బ్రహ్మాస్త్ర. ఈ మూవీ అప్ డేట్స్ ను రివీల్ చేస్తూ గ్రాండ్ మీట్ లో ఎంటర్ టైన్ చేశారు రణ్‌బీర్, ఆలియా. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు..

Brahmāstra: ఇంతకీ మీ పెళ్ళెప్పుడు.. అలియా రణ్‌బీర్ ఫన్నీ రియాక్షన్!

Brahmāstra

Brahmāstra: బాలీవుడ్ ఆడియెన్స్ మోస్ట్ అవైటైడ్ ప్రాజెక్ట్.. బ్రహ్మాస్త్ర. ఈ మూవీ అప్ డేట్స్ ను రివీల్ చేస్తూ గ్రాండ్ మీట్ లో ఎంటర్ టైన్ చేశారు రణ్‌బీర్, ఆలియా. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.. బ్రహ్మాస్త్ర అస్త్రాలేంటో చెప్పేసారు. చివరకి వాళ్లిద్దరి పెళ్లి కబురుపై కూడా కామెడీ చేశారు. 2022 సెప్టెంబర్ 9న డేట్ ఫిక్స్ చేసుకుంది బాలీవుడ్ బ్రహ్మాస్త్ర పార్ట్ 1. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో మూడు భాగాలుగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ఫర్ట్ పార్ట్ బ్రహ్మాస్త్ర – శివ టైటిల్ తో రెడీ అవుతోంది. లేటెస్ట్ గా రివీల్ చేసిన మోషన్ పోస్టర్ లో రణ్‌బీర్ కపూర్ సూపర్ మ్యాన్ గా.. శివుని అవతారం అన్నట్టు కనిపించాడు.

Liger: అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చిన రౌడీహీరో!

2018లో మొదలైన ఈ సినిమా.. కొవిడ్ కారణంగా వాయిదాలు పడి ఈమధ్యే షూటింగ్ పూర్తి చేసుకుంది. రణ్‌బీర్‌, అలియాలతో పాటూ అమితాబ్‌, డింపుల్‌ కపాడియా, నాగార్జున వంటి వారు నటించడం.. బాహుబలికి మించిన రేంజ్ లో గ్రాఫిక్స్ ఉంటాయమే వార్తలు రావడంతో బ్రహ్మాస్త్రపై ఎక్స్ పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్ ఈవెంట్ లో ఫుల్ గా సందడి చేశారు రణ్ బీర్, ఆలియా. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు.

Pushpa: The Rise: పుష్ప: ది రైజ్.. రివ్యూ

ఫ్యాన్స్ అడిగిన సరదా ప్రశ్నలకు సమాధానమిచ్చారు వీళ్లంతా. ఇందులోనే నీ జీవితంలో ఆర్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్పంటూ ఆలియాను ఆటపట్టించాడు రణ్‌బీర్. ఇక మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు ఫన్నీగా రియాక్ట్ అయ్యారు కానీ కరెక్ట్ అన్సర్ చెప్పుకుండానే తప్పించుకున్నారు. అయితే ముంబైలో మాత్రం రణ్‌బీర్, అలియాల పెళ్లికి సీక్రెట్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం నడుస్తోంది.