Lovers : ఏకాంత ప్రదేశంలో ప్రియుడితో ఉన్న కూతురు.. తండ్రి కంట పడటంతో.. రోడ్డుపైనే ఇలా

కూతురిని ప్రియుడితో ఏకాంత ప్రదేశంలో చూసిన తండ్రి బెల్టు తీసి వాతలు పడేలా చితకబాదాడు

Lovers : ఏకాంత ప్రదేశంలో ప్రియుడితో ఉన్న కూతురు.. తండ్రి కంట పడటంతో.. రోడ్డుపైనే ఇలా

Lovers

Lovers : చాలామంది యువతియువకులు ఇంట్లో తెలియకుండా ప్రేమాయణం నడిపిస్తుంటారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా చెట్టాపట్టాలేసుకు తిరుగుతుంటారు. అయితే ఇంట్లో వాళ్ళ కంట్లోపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ సమయంలో తల్లిదండ్రులు కానీ సోదరులు కానీ ఏ విధంగా స్పందిస్తారో ఊహించలేరు. కొందరు తమ పాపను తీసుకోని ఏ గొడవ లేకుండా వెళ్ళిపోతారు. మరికొందరు మాత్రం ఇద్దరి తాట తీస్తారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.

చదవండి : Lovers : ప్రేమించిన వారితో ఎక్కువ సమయం గడిపితే ఏమవుతుందో చెబుతున్న నిపుణులు

హర్దా జిల్లాలో ఓ యువతి ప్రియుడితో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళింది. అదే సమయంలో అటుగా వచ్చిన యువతి తండ్రి వీరిద్దరిని చూశాడు. వెంటనే పట్టుకొని ప్యాంట్ బెట్లు ఇప్పి ఇద్దరినీ చితకబాదాడు. ఓ వైపు కోపం మరోవైపు తన కూతురు చేస్తుందనే బాధతో వచ్చే కన్నీళ్లతో యువతియువకుడిని వాతలు పడేలా కొట్టాడు. ఇక ఈ దృశ్యాలను అక్కడ ఉన్న వారు తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక ఈ ఘటన విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

చదవండి : Lovers : ప్రియుడు మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య