Lovers : ప్రేమించిన వారితో ఎక్కువ సమయం గడిపితే ఏమవుతుందో చెబుతున్న నిపుణులు

ప్రేమించినావారితో ఎక్కువ సమయం గడిపితే ఏమవుతుందో నిపుణులు చెబుతున్నారు.

Lovers : ప్రేమించిన వారితో ఎక్కువ సమయం గడిపితే ఏమవుతుందో చెబుతున్న నిపుణులు

Expert Suggestions For Lovers

Expert Suggestions for Lovers : ప్రేమికులు ఇద్దరు ఏకాంతంగా ఉంటే ఈ లోకాన్నే మరచిపోతారు. తమనుతామే మైమరచిపోతారు. ఎన్నో కబుర్లు.. ఎన్నెన్నో ఊసులు. వారికి రోజుకు 24 గంటలు అస్సలు సరిపోవు. అన్ని కబుర్లు ఎక్కడనుంచి వస్తోయో మరి.. ప్రేమ ఎంతో మధురమైనది. ప్రేమకు ఇది అని నిర్వచనం చెప్పలేం. ప్రేమించివారు ఎదుటే ఉంటే ఆ భావన ఒకరిని మించి మరొకరికి ఎంతో తన్మయత్వం కలుగజేస్తుంది. అలా ప్రేమికులతో ఎక్కువ సేపు గడిపితే ఏం జరుగుతుంతో అనే విషయంపై నిపుణులు షాకింగ్ విషయాలు వెల్లడించారు.

Read more : Thieves love story : ఇద్దరు దొంగల లవ్ స్టోరీ.. వీళ్ల స్కెచ్‌లు అంతకు మించి

కార్డియాల‌జీ వైద్య నిపుణుల తెలిపిన వివరాల ప్ర‌కారం.. ఇద్ద‌రు ప్రేమికులు తొలిసారిగా క‌లిసిన‌ప్పుడు.. వారి నుంచి నోరిపినెఫ్రిన్, అడ్రిన‌లిన్ వంటి హార్మోన్లు విడుద‌ల‌వుతాయని.. ఈ హార్మోన్లు వారి మ‌న‌సుల్ని ఉత్తేజ‌ప‌రుస్తాయి. ప్రేమించిన వ్య‌క్తి మ‌న కళ్ల ముందు ఉండ‌టంతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణను క‌లుగుతుంది. దీంతో ఇద్దరి హృద‌య‌ాల్లో స్పంద‌న పెరుగుతుంది. మ‌న‌సులు ఉత్తేజిత‌మ‌వ‌డం, ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌డం, హృద‌య‌స్పంద‌న పెర‌గ‌డం అన్ని ఏక‌కాలంలోనే జ‌రిగిపోతాయి. ఇది ఓ ప్రత్యేకమైన భావన. ఎందుకు కలుగుతుందో.. ఎలా కలుగుతుందో అర్థంకాదు. కానీ జరిగేదంతా క్షణాల్లో జరిగిపోతుంది. వారిలో కలిగే భావనలు.. వారే గుర్తించనంతగా జరిగిపోతుంది.

ప్రేమించిన వ్య‌క్తితో ఎక్కువ స‌మ‌యం గ‌డిపితే..రొమాన్స్ పెరిగిపోతాయి. ఒకరికి ఒకరు తెలియ‌కుండానే అవ‌తలి వ్య‌క్తికి ద‌గ్గ‌ర‌వుతుంటారు. ఆ స‌మ‌యంలో మ‌న మెద‌డు నుంచి ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, వాసోప్రెసిన్ వంటి హార్మోన్లు విడుద‌లై ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన సంబంధాన్ని పెంపొందించ‌డంలో స‌హాయ ప‌డుతాయి.

Read more : Big Boss 5: హమీదా కావాలా?.. టైటిల్ కావాలా?.. శ్రీరామ్‌కు నాగ్ సూటి ప్రశ్న!

ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, వాసోప్రెసిన్ వంటి హార్మోన్లు.. రక్తపోటును తగ్గించడం, హృదయ స్పందన రేటును త‌గ్గిస్తాయి. దీంతో గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవ‌డానికి స‌హాయప‌డుతుంది. సైన్స్ ప్ర‌కారం.. ఓ వ్య‌క్తి తమ భాగస్వామితో అన్యోన్యంగా స‌మ‌యం గడిపినప్పుడు, వారి రక్తపోటు, హృదయ స్పందన తగ్గుతుంది. ఒకరికొకరు సురక్షితంగా, సుఖంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.