Bigg Boss 5 : మరోసారి గొడవపడ్డ ష‌ణ్ను, సన్నీ

సన్నీ మాత్రం ఇదొక ఆప్ష‌న్ మాత్ర‌మేన‌ని ఎవర్ని మార్చుకొనవసరం లేదని అన్నాడు. దీనికి ష‌ణ్ముఖ్ ఒప్పుకోలేదు. మార్చుకోవాల్సిందే అని, ఇది ఆప్ష‌న్ కాద‌ని బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు

Bigg Boss 5 : మరోసారి గొడవపడ్డ ష‌ణ్ను, సన్నీ

Shannu

Bigg Boss 5 :  ఈ సారి బిగ్ బాస్ లో ఎక్కువగా గొడవలే ఉన్నాయని మనకు తెలుస్తుంది. రోజు రోజుకి ఈ గొడవలు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ప్రస్తుతం బిగ్ బాస్ లో కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్క్‌ జరుగుతుంది. కెప్టెన్సీ టాస్క్ అంటే అందరూ సీరియస్ గా ఆడతారు. ఈ టాస్కుల్లో గొడవలు కూడా పడతారు. మొన్నటి నుంచి కెప్టెన్సీ టాస్కులు స్టార్ట్ అయ్యాయి. కంటెస్టెంట్స్ అందర్నీ రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ కి టాస్కులు ఇచ్చేలా చేశారు. దీంతో దొరికిందే ఛాన్స్ అని ఒక్కొక్కరు అవతలి వాళ్లపై తమ పగని తీర్చుకోడానికి చిత్ర విచిత్రమైన టాస్కులతో పాటు కష్టంగా ఉండే టాస్కులని కూడా ఇస్తున్నారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ 5లో థ్రిల్ లేదు.. ఈ సారి అమ్మాయిలు గెలుస్తారనుకున్నా.. కాని : కౌశల్

నిన్న ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. త‌మ టీమ్‌లోని ఒక‌రిని మ‌రొక టీమ్‌లోని ఒక‌రితో స్వాప్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అయితే ఇది అవకాశం మాత్రమే కంపల్సరీ ఏమి కాదు అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో త‌మ టీమ్‌లో నుంచి ఎవ‌రిని పంపించి అవ‌త‌లి టీమ్‌లో నుంచి ఎవ‌రిని తీసుకోవాలా అని అందరూ ఆలోచిస్తుంటే సన్నీ మాత్రం ఇదొక ఆప్ష‌న్ మాత్ర‌మేన‌ని ఎవర్ని మార్చుకొనవసరం లేదని అన్నాడు. దీనికి ష‌ణ్ముఖ్ ఒప్పుకోలేదు. మార్చుకోవాల్సిందే అని, ఇది ఆప్ష‌న్ కాద‌ని బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు, బిగ్ బాస్ ఇచ్చిన ఛాన్స్ వాడుకోవాలని అన్నాడు ష‌ణ్ను.

Chiranjeevi : చాలా గ్యాప్ తర్వాత ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాతో రాబోతున్న మెగాస్టార్

అవ‌కాశం ఇస్తున్నాం అంటే అదొక ఆప్ష‌న్ మాత్ర‌మేన‌ని తెలుగులో ఎవ‌రికైనా ఇదే అర్థ‌మవుతుంద‌ని స‌న్నీ సీరియస్ అవ్వగా అయితే నేను ఇంగ్లీషులో విన్నాను అని ఫైర్ అయ్యాడు ష‌ణ్ను. నేను చాలా కూల్‌గా చెప్తున్నా అని స‌న్నీ అనడంతో ఇక్క‌డ ఏసీ వేయ‌లేదు, వేడిగా ఉందని షన్ను కౌంట‌రిచ్చాడు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రి మ‌ధ్య మ‌రోసారి గొడవ పెద్దదయింది. నాకూ యాటిట్యూడ్‌ ఉంటుంది, కానీ అది వేరే ఉంటుంది అని స‌న్నీ వార్నింగ్ ఇవ్వ‌గా చూపించమ‌ని రెచ్చ‌గొట్టాడు ష‌ణ్ను. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య గొడవలు చాలా ఉన్నాయి. మరోసారి ఈ గొడవతో వీళ్లిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్నట్టు తయారయింది పరిస్థితి.