AHA : తొలి తెలుగు ఇండియన్ ఐడల్ ‘ఆహా’లో

తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాంగా వచ్చిన 'ఆహా' కొత్త కొత్త సినిమాలతో, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది. ఇవి మాత్రమే కాక టాక్ షోలు, గేమ్ షోలతో కూడా...........

AHA :  తొలి తెలుగు ఇండియన్ ఐడల్ ‘ఆహా’లో

Telugu Indian Idol

AHA :  ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం సింగర్స్ కి దేశంలోనే అతి పెద్ద ప్రోగ్రాం. అందులో పార్టిసిపేట్ చేయాలని, విన్ అవ్వాలని ఎంతోమంది సింగర్స్ కలలు కంటారు. మన తెలుగు నుంచి కూడా చాలా మంది ఈ షోలో పార్టిసిపేట్ చేసి కొంతమంది ఇండియన్ ఐడల్ గెలిచారు కూడా. అయితే తాజగా త్వరలో తెలుగు ఇండియన్ ఐడల్ రానుంది.

తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాంగా వచ్చిన ‘ఆహా’ కొత్త కొత్త సినిమాలతో, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది. ఇవి మాత్రమే కాక టాక్ షోలు, గేమ్ షోలతో కూడా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది ఆహా. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య బాబు, సమంత, సుమ, వైవా హర్షాలతో టాక్ షోలు చేసి సక్సెస్ అయింది. మరో వైపు మంచు లక్ష్మి, శ్రీముఖిలతో కుకింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేసింది. ఇటీవల ప్రదీప్ తో గేమ్ షో కూడా చేస్తుంది. తాజాగా మరో సరికొత్త ప్రోగ్రాం ‘తెలుగు ఇండియన్ ఐడల్’ తో రాబోతుంది ఆహా.

Bigg Boss 5 : బిగ్‌బాస్‌ ఫినాలేకి క్యూ కడుతున్న సెలబ్రిటీలు

తెలుగు సింగింగ్‌ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆహా ఈ సరికొత్త రియాలిటీ షోకు ప్లాన్‌ చేసింది. ఇండియన్ ఐడల్ మాదిరిగానే కేవలం తెలుగు సింగర్స్ కోసం తెలుగు ఇండియన్ ఐడల్ షో చేయనుంది. ఈ షోకి గతంలో ఇండియన్ ఐడల్ విన్నర్ అయిన రేవంత్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు. తాజాగా ఆడిషన్స్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించారు ఆహా నిర్వహకులు. డిసెంబర్‌ 26న ఈ ఆడిషన్స్‌ నిర్వహించనున్నారు. 14 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న గాయనీగాయకులు ఈ ఆడిషన్స్ కి వెళ్లొచ్చు. ఈ ఆడిషన్స్‌ హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని ఒయాసిస్‌ స్కూల్‌లో నిర్వహించనున్నారు.