iPhone 14 Discount Offer : ఫ్లిప్‌కార్ట్‌లో న్యూ ఇయర్ ఆఫర్.. ఐఫోన్ 14పై ఎప్పుడూ లేనంతగా భారీ డిస్కౌంట్.. ఇదే బెస్ట్ టైం.. వెంటనే కొనేసుకోండి!
iPhone 14 Discount Offer : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లేటెస్టు సెట్ ఐఫోన్‌లలో ఎప్పుడూ లేనంత క్రేజీ ధర తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది.

Flipkart to offer massive discount on iPhone 14 as part of New Year offer
iPhone 14 Discount Offer : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లేటెస్టు సెట్ ఐఫోన్‌లలో ఎప్పుడూ లేనంత క్రేజీ ధర తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ 14 (iPhone 14), ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus)లను అత్యంత చౌకైన ధరకే అందిస్తామని వెల్లడించింది. Flipkartలో రాబోయే iPhone డీల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 సిరీస్‌ను తగ్గింపు ధరకు అందించడం ఇదే మొదటిసారి కాదు. ఫెస్టివల్ సీజన్ సమయంలోనూ ఐఫోన్ 14పై అనేక సార్లు భారీ డిస్కౌంట్లను అందించింది. 2023 కొత్త ఏడాది సందర్భంగా ఐఫోన్ 14పై మరోసారి ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డీల్ అందిస్తోంది. దీపావళి సందర్భంగా ఐఫోన్ 13 దాదాపు రూ.49,999కి విక్రయించింది. ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత, ఆపిల్ పాత వెర్షన్ రిటైల్ ధరను రూ.69,990కి తగ్గించనున్నట్లు ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13పై దాదాపు రూ. 20వేల తగ్గింపును అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్ లిమిటెడ్ పిరియడ్ వ్యవధి మాత్రమే అందుబాటులో ఉంటుంది. సేల్ వ్యవధిలో కంపెనీ ధరను పెంచింది. ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ సెట్ ఐఫోన్‌లలో కూడా అదే ధరను ఉంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఐఫోన్ 14 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో (128GB స్టోరేజ్) మోడల్ ధర రూ. 73,990కి లిస్టు అయింది. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ ధర రూ.83,990కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఇంకా డీల్ వివరాలను వెల్లడించలేదు. ఈ డీల్ ఫ్లాట్ డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్‌లపై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ 13 ప్రారంభ ధర రూ. 64,999తో సేల్ అందుబాటులో ఉంది.
ఈ ఐఫోన్ మోడల్‌పై కంపెనీ డిస్కౌంట్ కూడా ఇస్తుందో లేదో తెలియదు. భారత మార్కెట్లో కొత్త ఐఫోన్ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ అందుబాటులో లేదు. ఐఫోన్ 13 ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఐఫోన్ 14 కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెండూ ఐఫోన్లు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. ఫీచర్లలో ఎలాంటి మార్పు లేదు.
చిప్‌సెట్, బ్యాటరీ, డిస్‌ప్లే, ప్రైమరీ కెమెరా సెటప్ ఒకే విధంగా ఉంటాయి. మీరు పాత వెర్షన్‌తో పాటు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ను కూడా పొందవచ్చు. డిజైన్ పరంగా కూడా ఐఫోన్ రెండు మోడల్స్ ఒకేలా ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారంలో ఐఫోన్ 13 ధరకు ఐఫోన్ 14ని అందిస్తే.. లేటెస్ట్ వెర్షన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ కొత్త ధరలను ఫ్లిప్‌కార్ట్ ఇంకా రివీల్ చేయలేదు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..