Flipkart Valentine’s Day Sale : ఫ్లిప్‌కార్ట్‌లో వ్యాలెంటైన్స్ డే సేల్.. ఈ 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

Flipkart Valentine's Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో వ్యాలెంటైన్స్ డే సేల్‌ (Flipkart Valentine's Day Sale)ను నిర్వహిస్తోంది.

Flipkart Valentine’s Day Sale : ఫ్లిప్‌కార్ట్‌లో వ్యాలెంటైన్స్ డే సేల్.. ఈ 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

Flipkart Valentine’s Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో వ్యాలెంటైన్స్ డే సేల్‌ (Flipkart Valentine’s Day Sale)ను నిర్వహిస్తోంది. అనేక 5G ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. Nothing Phone (1), iPhone 13, Samsung Galaxy S21 FE, Realme GT Neo 3T వంటి మరిన్ని 5G ఫోన్‌లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. మీరు 5G ఫోన్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ కింది 5G ఫోన్లపై ఓసారి లుక్కేయండి..

నథింగ్ ఫోన్ (1) ఎలాంటి నిబంధనలు లేదా షరతులు లేకుండా రూ. 26,999కి కొనుగోలు చేయవచ్చు. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ 5G ఫోన్‌లో ఇదే అత్యల్ప ధరగా చెప్పవచ్చు. భారత మార్కెట్లో ఈ హ్యాండ్‌సెట్ ధర రూ. 32,999కి ఉండగా.. వ్యాలెంటైన్స్ డే సేల్ ద్వారా తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.

Flipkart Valentine's Day Sale _ Samsung Galaxy S21 FE, iPhone 13, Pixel 7, and more discounted

Flipkart Valentine’s Day Sale _ Samsung Galaxy S21 FE, iPhone 13, Pixel 7

Realme 10 Pro+ ఫోన్ కొత్త 5G మోడల్.. భారత మార్కెట్లో ఇటీవలే లాంచ్ అయింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ కొత్త 5G ఫోన్ రూ. 24,999 తగ్గింపు ధరతో పొందవచ్చు. ఆల్ రౌండర్ 5G ఫోన్. Realme GT నియో 3T కూడా అమ్మకానికి ఉంది. రూ. 24,999కి సేల్ అవుతుంది. ఈ డివైజ్ హుడ్ కింద వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

Read Also : Valentines Day Offer : వ్యాలెంటైన్స్ డే ఆఫర్.. ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఐఫోన్ మోడల్ ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

అద్భుతమైన కెమెరా ఫీచర్లను కోరుకునే కొనుగోలుదారులు పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ. 56,999కి అందుబాటులో ఉంది. అయితే, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో పిక్సెల్ 7 ధర రూ. 49,999లకు కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ (Samsung) యూజర్లు Galaxy S21 FE స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 34,999కి అందుబాటులో ఉంది. ఇతర మిడ్ రేంజ్ ఫోన్‌ల మాదిరిగా కాకుండా ఈ డివైజ్ IP68 రేట్ అయింది. సగటు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Flipkart Valentine's Day Sale _ Samsung Galaxy S21 FE, iPhone 13, Pixel 7, and more discounted

Flipkart Valentine’s Day Sale _ Samsung Galaxy S21 FE, iPhone 13, Pixel 7

ఐఫోన్ 13 మళ్లీ అమ్మకానికి వచ్చింది. భారత మార్కెట్లో రూ. 60వేల కన్నా తక్కువ ధరకు పొందవచ్చు. Flipkart ఈ డివైజ్‌పై తగ్గింపును అందజేస్తూనే ఉంది. ఎందుకంటే.. iPhone 13 Apple అత్యంత ప్రజాదరణ పొందిన iPhoneలలో ఒకటిగా ఉంది. ఎందుకంటే ఇటీవల లాంచ్ అయిన iPhone 14 వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Flipkart Valentine's Day Sale _ Samsung Galaxy S21 FE, iPhone 13, Pixel 7, and more discounted

Flipkart Valentine’s Day Sale _ Samsung Galaxy S21 FE, iPhone 13, Pixel 7

రెండు 5G ఫోన్‌లు ఒకే చిప్‌సెట్, కెమెరా సెటప్, ఇతర స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. iPhone 13 ధర రూ. 61,999తో అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2వేల తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. ఈ ఐఫోన్‌ను రూ. 59,999 ధరతో కొనుగోలు చేయొచ్చు. కొన్ని 5G ఫోన్‌లు గత ఏడాదిలో లాంచ్ అయ్యాయి. కొంచెం పాతవి అయినప్పటికీ లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పొందవచ్చు.

Read Also : Best Smartphones 2023 : ఈ ఫిబ్రవరిలో రూ.60వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ ఫోన్ కొనేసుకోండి..!