Valentines Day Offer : వ్యాలెంటైన్స్ డే ఆఫర్.. ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఐఫోన్ మోడల్ ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
Valentines Day Offer : వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

iPhone 13, iPhone 14, MacBook Air M1 and more get big discount in India ahead of Valentine’s Day
Valentines Day Offer : వాలెంటైన్స్ డే (Valentine’s Day) సందర్భంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ప్రత్యేకించి పలు ఆపిల్ ఐఫోన్లు (Apple iphones)పై భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల వినియోగదారులు తమకు నచ్చిన ఐఫోన్ మోడల్ అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
కొత్త ఐఫోన్ 14 సిరీస్‌పై కూడా అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్ 13 (iphone 13) సిరీస్, ఐఫోన్ 12 (iPhone 12)పై కూడా భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. ఆపిల్ ప్రొడక్టుల్లో మ్యాక్‌బుక్ ఎయిర్ (MacBook Air M1) తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఆపిల్ ప్రొడక్టులపై మరిన్ని డీల్స్ మీకోసం అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయడి..
iphone 13 :
ఈ-కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్‌కార్ట్ (Flipkart), ఆపిల్ అధీకృత ఇమాజిన్ స్టోర్ (Imagine Store) వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ధరకు అందిస్తున్నాయి. ఆపిల్ నుంచి అత్యంత పాపులర్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మోడల్ కొత్త ఐఫోన్ వెర్షన్‌తో సమానంగా ఉంటుంది. కొనుగోలుదారులు ఈ ఐఫోన్ 13 మోడల్ చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. iPhone 13పై ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 61,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. రూ. 2,000 తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. తద్వారా ఐఫోన్ 13 సిరీస్ రూ.59,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.
మరోవైపు.. iVenus ఆన్లైన్ స్టోర్ కూడా చాలా తక్కువ ధరకు iPhone 13ని అందిస్తోంది. రూ. 7,000 ఫ్లాట్ తగ్గింపు ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో రూ. 62,900కి డివైజ్ అందుబాటులో ఉంది. HDFC బ్యాంక్ ఆఫర్ కూడా ఈ స్టోర్‌లో అందుబాటులో ఉంది. దీని ద్వారా ఐఫోన్ 13 ధర రూ.60,900కి తగ్గుతుంది.

Valentines Day Offer : iPhone 13, iPhone 14, MacBook Air M1 and more get big discount in India
రూ. 8,000 ఎక్స్ఛేంజ్ బోనస్, పాత ఐఫోన్లపై రూ. 22,000 వరకు సాధారణ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. కస్టమర్లు ఈ ఆఫర్లతో ఐఫోన్ 13ని అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్లో పూర్తి తగ్గింపును పొందలేరు. మీ పాత ఫోన్ కండిషన్, ఎన్నాళ్లుగా వాడుతున్నారు అనే ఆధారంగా ఆఫర్ వర్తిస్తుంది.

Valentines Day Offer : iPhone 13, iPhone 14, MacBook Air M1 and more get big discount in India
iPhone 13 Pro :
విజయ్ సేల్స్ (Vijay Sales)లో ఆపిల్ ఐఫోన్ 13 Pro తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 ప్రో అసలు ధర రూ. 1,19,900 ఉండగా.. తగ్గింపుతో 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,11,600లకు అందుబాటులో ఉంది. ఆసక్తి గల కొనుగోలుదారులు ఐఫోన్ 13 ప్రోని రూ. 88,000 వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. విజయ్ సేల్స్ వివరాల ప్రకారం.. ఓపెన్ బాక్స్ (డెమో యూనిట్)పై రెండు ధరలు గ్రీన్ కలర్ మోడల్స్‌పై తగ్గింపు అందిస్తున్నాయి.

Valentines Day Offer : iPhone 13, iPhone 14, MacBook Air M1 and get big discount in India
iPhone 14 :
ఆపిల్ ఐఫోన్ 14పై కూడా ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో రూ. 66,999 ధరతో అందుబాటులో ఉంది. లేటెస్ట్ వెర్షన్లో అతి తక్కువ ధర అని చెప్పవచ్చు. 128GB స్టోరేజ్ మోడల్‌ను కూడా అదే ధరకు సొంతం చేసుకోవచ్చు. iVenus, Vijay Sales కూడా ఈ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తున్నాయి. అయితే కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌లో మెరుగైన డీల్ పొందవచ్చు. రూ. 20వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఐఫోన్ 13 చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

Valentines Day Offer : iPhone 13, iPhone 14, MacBook Air M1 and more get big discount in India
MacBook Air M1 :
మ్యాక్‌బుక్ Air M1 ల్యాప్‌టాప్ మోడల్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 86,990కు విక్రయిస్తోంది. ఈ ధర Apple M1 ప్రాసెసర్‌తో ఆధారితమైనది. సాధారణ వినియోగంతో పాటు ఇమేజ్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. కానీ, వీడియో ఎడిటింగ్ లేదా గేమింగ్ వంటి ఫీచర్లను పొందలేరు.