Siddharth: మోసగాళ్లు ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు.. సమంతా గురించేనా?

టాలీవుడ్ స్వీట్ కపుల్ గా పేరున్న నాగచైతన్య-సమంతాల జంట విడాకుల కోసం కోర్టు మెట్లెక్కేసింది. అధికారికంగా ఇద్దరూ విడాకులను ఖరారు చేయడమే కాక అక్కినేని కుటుంబం కూడా ఈ వ్యవహారంపై ఔను..

Siddharth: మోసగాళ్లు ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు.. సమంతా గురించేనా?

Siddharth

Siddharth: టాలీవుడ్ స్వీట్ కపుల్ గా పేరున్న నాగచైతన్య-సమంతాల జంట విడాకుల కోసం కోర్టు మెట్లెక్కేసింది. అధికారికంగా ఇద్దరూ విడాకులను ఖరారు చేయడమే కాక అక్కినేని కుటుంబం కూడా ఈ వ్యవహారంపై ఔను నిజమే అని తేల్చిచెప్పేసింది. నేటివరకు పుకార్ల వరకు మాత్రమే ఉన్న చై-సామ్ విడాకుల అంశం నేటితో విడిపోతారని కన్ఫర్మ్ అయిపొయింది.

Dethadi Harika: ఒంపులతో దేత్తడి అందాల జాతర!

ఎవరు ఊహించని విధంగా నాగ చైతన్య, సమంత ఈవార్త ప్రకటించడంతో ఫ్యాన్స్ అందరూ షాక్ కి గురయ్యారు. ఈ నేపథ్యంలో నటుడు సిద్ధార్థ్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. అందులో, “మోసగాళ్ళు ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు. ఇదే నేను నా స్కూల్ లో నేర్చుకున్న పాఠం. మీరు మీ స్కూల్లో ఏం నేర్చుకున్నారు?” అని ట్వీట్ చేశారు. సామ్-చై విడాకుల నేపథ్యంలోనే సిద్దార్థ్ ఈ ట్వీట్ చేశాడని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Sankranti 2022 Films: సంక్రాంతి పందెం కోళ్లు.. నిజంగా పెద్ద పండగే!

కాగా, సిద్దార్థ్ ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన నటి పూనమ్ కౌర్ ఔను నిజమే అంటూ కామెంట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ లు.. విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో చర్చగా మారింది. సిద్ధార్థ్, సమంతకి అంతకు ముందు జరిగిన విషయం అప్పట్లో చాలా చర్చల్లో నిలిచింది. సిద్ధార్థ్ ఇలా ఇండైరెక్ట్ గా ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి ఏమి కాదు. అంతకుముందు కూడా ట్వీట్ చేశారు. కొంత మంది ఏమో సమంత గురించి అంటే. మరికొంతమంది ఏమో వేరే విషయం గురించి అని కామెంట్ చేస్తున్నారు.