Sankranti 2022 Films: సంక్రాంతి పందెం కోళ్లు.. నిజంగా పెద్ద పండగే!

ఈ ఏడాది సంక్రాంతికి కరోనా అడ్డుపడగా సినిమా వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. కానీ నెక్ట్స్ ఇయర్ మాత్రం అస్సలు తగ్గేదే లేదంటున్నారు మన హీరోలు. సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి..

Sankranti 2022 Films: సంక్రాంతి పందెం కోళ్లు.. నిజంగా పెద్ద పండగే!

Sankranti 2022 Films

Updated On : October 2, 2021 / 8:19 PM IST

Sankranti 2022 Films: ఈ ఏడాది సంక్రాంతికి కరోనా అడ్డుపడగా సినిమా వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. కానీ నెక్ట్స్ ఇయర్ మాత్రం అస్సలు తగ్గేదే లేదంటున్నారు మన హీరోలు. సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి ధియేటర్లో సినిమాల దండయాత్ర జరగబోతోంది. సంక్రాంతికి ఇప్పటికి అఫీషియల్ గా నాలుగు భారీ తెలుగు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ ఫిక్స్ అయిన డేట్స్ ప్రకారం సంక్రాంతి ఫైట్ ని ముందుగా స్టార్ట్ చేసేది ఆర్ఆర్ఆర్. ఈరోజే మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ఖరారు చేశారు.

Ravi Teja: దూకుడు మీదున్న మాస్ రాజా.. సెట్స్ మీదకి మరో సినిమా!

పండక్కి నేను వస్తున్నా అని రానాతో కలిసి పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ తో వస్తుంటే.. సర్కారు వారి పాటతో మహేష్ బాబు, రెట్రో లవ్ స్టోరీతో ప్రభాస్ రిలీజ్ బరిలోకి దిగుతున్నారు. ఇందులో అందరికంటే ముందుగా సంక్రాంతికి వారం రోజుల ముందే జనవరి 7న ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ థియేటర్లలో దిగిపోతుండగా 12న పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సందడిని పెంచడానికే ఫిక్స్ అయ్యాడు.

RRR Release Date : రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికి ముందే..

ఇక గత ఏడాది సంక్రాంతికి సరిలేరునీకెవ్వరు సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టిన మహేష్ బాబు సర్కారు వారి పాటతో జనవరి 13న వస్తున్నాడు. ఇక మూడేళ్ళ నుండి ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ ఆ తర్వాత జనవరి 14న రాధేశ్యామ్ తో వస్తున్నాడు. మన సినిమాలకే స్పేస్ లేక, ధియేటర్లు సరిపోక, ఎక్కడ అక్యుపై చెయ్యాలో తెలీక స్టార్లు, ప్రొడ్యూసర్లు సతమతమవుతుంటే.. ఈ టైట్ షెడ్యూల్ లో తమిళ్ స్టార్ హీరో అజిత్ కూడా సంక్రాంతి బరిలోకి యాడ్ అయ్యారు.

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

అజిత్ హీరోగా, కార్తికేయ విలన్ గా తెరకెక్కుతున్న రేసింగ్ యాక్షన్ డ్రామా వలిమై కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ఇలా ఫెస్టివల్స్ అన్నీ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయి.. ధియేటర్లు స్టార్ వార్ కోసం వెయిట్ చేస్తుండగా ఈ ఫెస్టివల్ టైంలో బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టే కింగ్ ఎవరవుతారన్నది ఆసక్తిగా మారింది.