Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

తెలుగు సినిమా పరిశ్రమలో మరో బంధం బీటలు వారింది. ఇండస్ట్రీలోనే యంగ్ కపుల్స్ లో క్యూట్ కపుల్ గా పేరున్న సమంతా.. నాగ చైతన్యల పదేళ్ల బంధం చివరి దశకు చేరుకుంది..

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

Chay Sam

Naga Chaitanya-Samantha: తెలుగు సినిమా పరిశ్రమలో మరో బంధం బీటలు వారింది. ఇండస్ట్రీలోనే యంగ్ కపుల్స్ లో క్యూట్ కపుల్ గా పేరున్న సమంతా.. నాగ చైతన్యల పదేళ్ల బంధం చివరి దశకు చేరుకుంది. తామిద్దరం విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా చైతన్య ప్రకటించాడు. దీంతో ఈ అంశం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు సినీ పరిశ్రమలోని భారీ ఇమేజ్ ఉన్న నాలుగైదు కుటుంబాలలో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. దీంతో ఇప్పుడు ఈ విడాకుల అంశంపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి.

ChaySam : విడిపోతూ కూడా ఒకేమాట..

పరిశ్రమలోనే భారీ ఇమేజ్ ఉన్న అక్కినేని కుటుంబం నుండి మూడవ వారసుడుడైన నాగచైతన్యని 2017 అక్టోబర్ 7న పెళ్లి చేసుకుంది సమంత. అంతే అప్పటివరకున్న సమంత ఇమేజ్ కాస్త రెట్టింపు అయిపోయింది. పెళ్ళికి ముందు కూడా మంచి హిట్సే ఉన్నా.. పెళ్లి తరువాత మాత్రం వరుస బ్లాక్ బస్టర్స్ తో కెరీర్ లో పీక్స్ స్టేజికి వెళ్ళిపోయింది. అక్కినేని కోడలిగా సమాజంలో గొప్ప గౌరవమూ పొందింది. అన్నింటికీ మించి మోస్ట్ హంబుల్ హీరో అని పేరున్న నాగచైతన్య వంటి మొగుడిని దక్కించుకుంది.

Chay- Sam: క్యూట్ కపుల్ సమంతా.. చైతన్య

కానీ ఈ ఆనందాలన్నీ మూన్నాళ్ళ ముచ్చటే అయ్యాయి. వీరి వివాహబంధం నాలుగేళ్లు నిండకుండానే ముగించేశారు. నిజానికి వీరి విడాకుల అంశంపై చాలాకాలంగా రకరకాల రూమర్లు వస్తుండగా సమంతా సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కూడా వాటిని నిజమనేలా ఉంటూ సాగాయి. అయితే.. ఏదో అద్భుతం జరిగి ఈ జంట విడాకుల అంశంలో వెనక్కు తగ్గుతారని అభిమానులు ఆశించారు. కానీ, వారి అభిమాన ఆశీర్వాదాలు కూడా ఫలించలేదు. చివరికి విడిపోయేందుకు సిద్ధమయ్యారు.

Naga Chaitanya – Samantha : కన్ఫామ్.. విడిపోయిన నాగ చైతన్య – సమంత

అయితే, అసలు ఈ బంధం చెడిపోయేందుకు కారణాలేంటి అన్నదానిపై కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. అక్కినేని కుటుంబంతో సమంతకి పొసగని కారణంగానే ఈ జంట మధ్య విబేధాలు మొదలయ్యాయన్నది ప్రధాన ప్రచారం. అక్కినేని కుటంబ కట్టుబాట్లకు సమంత అడ్జెస్ట్ అవ్వలేకపోవడం.. చైతూ దీనిపై సమంతను గైడ్ చేయడం నచ్చని కారణంగానే వీరిద్దరి మధ్య తరచుగా గొడవలకు దారితీసినట్లుగా తెలుస్తుంది. కెరీర్ పరంగా ఎవరికి వారు బిజీ లైఫ్ తో కుటుంబంలో కలిసి ప్రయాణించే సమయం లేకపోవడం.. చివరికి అది ఈగో సమస్యగా మారి చివరికి విడాకులకు దారితీసినట్లుగా కనిపిస్తుంది.