Genelia Deshmukh : మజిలీ రీమేక్ తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన జెనీలియా.. భారీ కలెక్షన్స్ కొల్లగొడుతున్న వేద్..

చాలా సంవత్సరాల తర్వాత జెనీలియా పూర్తి నిడివి ఉన్న సినిమాతో కంబ్యాక్ ఇచ్చింది. తన భర్త రితేష్ దేశ్ ముఖ్ హీరోగా అతని దర్శకత్వంలోనే తెరకెక్కిన వేద్ సినిమాలో జెనీలియా పూర్తి స్థాయి పాత్రలో నటించింది. ఈ సినిమా మన తెలుగు మజిలీ సినిమాకి రీమేక్ గా.............

Genelia Deshmukh : మజిలీ రీమేక్ తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన జెనీలియా.. భారీ కలెక్షన్స్ కొల్లగొడుతున్న వేద్..

Genelia Deshmukh gives grand comeback with ved movie

Genelia Deshmukh :  ఒకప్పుడు టాలీవుడ్ లో హ్యాపీ, బొమ్మరిల్లు, ఆరెంజ్.. లాంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన జెనీలియా అనంతరం బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయి అక్కడే సెటిల్ అయింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకొని, ఇద్దరి పిల్లల్ని కని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకి దూరమైనా అడపాదడపా కొన్ని సినిమాల్లో గెస్ట్ పాత్రలు పోషించింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది.

చాలా సంవత్సరాల తర్వాత జెనీలియా పూర్తి నిడివి ఉన్న సినిమాతో కంబ్యాక్ ఇచ్చింది. తన భర్త రితేష్ దేశ్ ముఖ్ హీరోగా అతని దర్శకత్వంలోనే తెరకెక్కిన వేద్ సినిమాలో జెనీలియా పూర్తి స్థాయి పాత్రలో నటించింది. ఈ సినిమా మన తెలుగు మజిలీ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఇందులో సమంత పోషించిన పాత్రని జెనీలియా పోషించింది. ఈ సినిమాని జెనీలియానే నిర్మించడం విశేషం. జెనీలియా చాలా రోజుల తర్వాత గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ఈ వేద్ సినిమా భారీ విజయం సాధించింది.

Kirak RP : కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపలపులుసు కర్రీ పాయింట్ రీ ఓపెన్..

అయితే ఈ సినిమాని మరాఠీలో నిర్మించారు. మరాఠీలో నిర్మించి భారీ విజయం సాధించడం అంటే మాములు విషయం కాదు. వేద్ సినిమా డిసెంబర్ 30న రిలీజవ్వగా మొదటి వారం 20 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది ఈ సినిమా. ఇంకా కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. సొంత నిర్మాణ సంస్థే కావడంతో ఇప్పటికే ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసినట్టు సమాచారం. దీంతో రీమేక్ సినిమా అయినా గాని జెనీలియా మంచి హిట్ తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది అంటున్నారు.