Kirak RP : కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపలపులుసు కర్రీ పాయింట్ రీ ఓపెన్..

ఇటీవలే కిరాక్ ఆర్పీ తన నెల్లూరు పెద్దారెడ్డి చేపలపులుసు కర్రీ పాయింట్ ని గ్రాండ్ గా మళ్ళీ రీ ఓపెన్ చేశాడు. నెల్లూరు నుంచి కొంతమంది మహిళలని తీసుకువచ్చి, తానే ఆశ్రయం ఇచ్చి వారితోటే కట్టెలపొయ్యి................

Kirak RP : కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపలపులుసు కర్రీ పాయింట్ రీ ఓపెన్..

Kirak RP Nelluru peddareddy chepalapulusu curry point re opened

Kirak RP :  జబర్దస్త్ తో మంచి పేరు, ఫేమ్ తెచ్చుకున్న నటుడు కిరాక్ ఆర్పీ. ప్రస్తుతం నటుడిగా, దర్శకుడిగా బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఇటీవల నెల్లూరు పెద్దారెడ్డి చేపలపులుసు అనే కర్రీ పాయింట్ ని గ్రాండ్ గా హైదరాబాద్ KPHB లో ఓపెన్ చేశాడు. ఆర్పీది నెల్లూరు కావడంతో, అక్కడ చేపల పులుసు బాగా ఫేమస్ కావడంతో నెల్లూరులో కట్టెల పొయ్యి మీద వండేలాగే, అదే టెస్ట్ తో ఇక్కడ కూడా అందించాలని ఈ కర్రీ పాయింట్ పెట్టాడు.

కిరాక్ ఆర్పీ పెట్టిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ గ్రాండ్ సక్సెస్ అయింది. జనాలు విపరీతంగా వచ్చారు. ఇక వీకెండ్స్ లో అయితే షాప్ దగ్గర లైన్లు కట్టారు, లాభాలు కూడా బాగా వచ్చాయి. కానీ జనాలు ఎక్కువ అవ్వడంతో వారికి సరిపడా ఫుడ్ అందించలేకపోయాడు, అలాగే ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడింది. దీంతో ఒక వారం రోజుల పాటు షాప్ ని మూసేసి మరింతమందిని పనిలోకి తీసుకొని, ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ అయ్యేలాగా రెడీ చేసి మళ్ళీ షాప్ తెరుస్తాను అని చెప్పాడు.

KTR : కంటెంట్ ఉన్న సినిమా దేశం అంతా ఆడుతుంది.. మరి కంటెంట్ ఉన్న నాయకుడు ఎందుకు హిట్ కాడు??

ఇటీవలే కిరాక్ ఆర్పీ తన నెల్లూరు పెద్దారెడ్డి చేపలపులుసు కర్రీ పాయింట్ ని గ్రాండ్ గా మళ్ళీ రీ ఓపెన్ చేశాడు. నెల్లూరు నుంచి కొంతమంది మహిళలని తీసుకువచ్చి, తానే ఆశ్రయం ఇచ్చి వారితోటే కట్టెలపొయ్యి మీద రకరకాల చేపల వంటలు, పులుసులు తయారు చేయిస్తున్నాడు. ఉదయం నాలుగింటికి పనులు మొదలవుతాయని చెప్పాడు ఆర్పీ. ఈసారి మరింత ఎక్కువ మందికి అందేలా చేస్తామని చెప్పాడు. రీ ఓపెన్ లో కూడా కస్టమర్లు బాగానే వస్తున్నారు. దీంతో త్వరలో మరిన్ని కర్రీ పాయింట్ బ్రాంచ్ లు ఓపెన్ చేస్తామని తెలిపాడు.