Genelia : జెనీలియా రీఎంట్రీ.. భర్త దర్శకత్వంలోనే..

తాజాగా దాదాపు పదేళ్ల తర్వాత జెనీలియా మళ్లీ వెండితెరపై కనిపించబోతుంది. 2012లో రితేష్‌ తో పెళ్లి తర్వాత ఓ మరాఠీ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. ఇప్పుడు మళ్ళీ మరాఠీ........

Genelia : జెనీలియా రీఎంట్రీ.. భర్త దర్శకత్వంలోనే..

Genelia

Genelia :  తెలుగులో ఒకప్పుడు జెనీలియా చేసిన సందడి అంతా ఇంతా కాదు. జెనీలియా చేసిన తెలుగు సినిమాల్లో చాలా వరకు మంచి విజయం సాధించాయి. ‘సై’, ‘హ్యాపీ’, ‘బొమ్మరిల్లు’, ‘ఢీ’, ‘ఆరంజ్’… లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించింది. ఆ తర్వాత బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకొని సినిమాలకి దూరం అయింది. సినిమాలకి దూరం అయినా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది.

తాజాగా దాదాపు పదేళ్ల తర్వాత జెనీలియా మళ్లీ వెండితెరపై కనిపించబోతుంది. 2012లో రితేష్‌ తో పెళ్లి తర్వాత ఓ మరాఠీ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. ఇప్పుడు మళ్ళీ మరాఠీ సినిమాతోనే జెనీలియా రీఎంట్రీ ఇవ్వబోతుంది. మరాఠీలో జెనీలియా హీరోయిన్ గా చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాని ఆమె భర్త రితేష్‌ దర్శకత్వం వహించడం విశేషం. దర్శకుడిగా రితేష్‌కి కూడా ఇది తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

Samantha : సమంతపై వచ్చే పుకార్లను నమ్మొద్దు : సమంత మేనేజర్

‘వేద్‌’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నేను మహారాష్ట్రలో పుట్టి, పెరిగాను. కానీ మరాఠీలో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర చేయలేదు. ఈ సినిమాతో అది కూడా పూర్తవుతుంది అని తెలిపింది జెనీలియా. అలాగే నేను మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నాను అని, భర్త ని ట్యాగ్ చేస్తూ డైరెక్టర్ గా కల నెరవేరుతుంది అని జెనీలియా పోస్ట్ చేసింది. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 12న ఈ చిత్రం విడుదల కానుంది.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad)