Kartik Aaryan : గులాబీలతో యువ హీరో వెంటపడ్డ అమ్మాయిలు.. సిగ్గుపడుతూనే ఫొటోలిచ్చిన హీరో

తాజాగా ఈ యువ హీరో వెనకాల మరోసారి అమ్మాయిలు పడ్డారు. అయితే ఈ సారి ఏకంగా విమానాశ్రయంలోనే వెంటపడ్డారు. ఇటీవల వేకేషన్‌ కోసం గోవా వెళ్లాడు కార్తీక్‌ ఆర్యన్‌. అక్కడి నుంచి తిరిగి........

Kartik Aaryan : గులాబీలతో యువ హీరో వెంటపడ్డ అమ్మాయిలు.. సిగ్గుపడుతూనే ఫొటోలిచ్చిన హీరో

Kartik Aryan

 

Kartik Aaryan :  బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తిక్ ఆర్యన్ కు అక్కడి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువే ఉంది కార్తిక్ కి. గతంలో కొంత మంది అమ్మాయిలు కార్తీక్ ని కలవాలని వాళ్ళ ఇంటి ముందు వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కార్తీక్ ఎక్కడికి ఐనా వస్తున్నాడు అని తెలిస్తే అమ్మాయిలు ముందుంటారు. గతంలో ఒక నెటిజన్‌ 20 కోట్లిస్తాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని, ఓ నెటిజన్ నా కామెంట్ కి రిప్లై ఇస్తే 10 లక్షలు ఇస్తా అని ఇలా అమ్మాయిలు కార్తీక్ ఆర్యన్ కి బంపర్ ఆఫర్ లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా ఈ యువ హీరో వెనకాల మరోసారి అమ్మాయిలు పడ్డారు. అయితే ఈ సారి ఏకంగా విమానాశ్రయంలోనే వెంటపడ్డారు. ఇటీవల వేకేషన్‌ కోసం గోవా వెళ్లాడు కార్తీక్‌ ఆర్యన్‌. అక్కడి నుంచి తిరిగి వస్తూ ముంబై విమానాశ్రయంలో దిగి బయటకి వస్తూ ఉండగా అక్కడ ఇద్దరు అమ్మాయిలు గులాబీలు పట్టుకుని కార్తీక్ వెంటపడ్డారు. కొద్ది సేవు పట్టించుకోకుండా నడిచాడు కార్తీక్. ఆ పువ్వులు తీసుకోమని బతిమాలుతూ వెంటపడ్డారు.

Hebah patel : హెబ్బా పటేల్ సర్జరీ చేయించుకుందా??

అందులో ఒక అమ్మాయి ఆరోజు తన బర్త్‌డే అని కొన్ని పూలు ఇవ్వగా అందులో కొన్ని గులాబీలు తీసుకున్నాడు. ఆ తర్వాత వారితో కలిసి ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు. వాళ్ల అభిమానం చూసి సిగ్గు పడుతూ వెళ్లిపోయాడు కార్తీక్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియోలో వైరల్ అవుతుంది. మొత్తానికి కార్తిక్ ఆర్యన్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే అని మరోసారి తెలిసింది బాలీవుడ్ కి..