Actress Workouts: గ్లామర్ క్వీన్స్ వర్కౌట్ పాఠాలు.. ఫ్యాన్స్ ఫిదా!

గ్లామర్ క్వీన్స్ అంటే ఫిట్‌ గా ఉండాల్సిందే. ఫిట్‌నెస్‌ తగ్గినా.. షేపౌట్‌ అయినా సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయడం కష్టమే. అందుకే టైమ్‌ దొరికితే జిమ్‌లో, ఫిట్‌నెస్‌ సెంటర్లలో..

Actress Workouts: గ్లామర్ క్వీన్స్ వర్కౌట్ పాఠాలు.. ఫ్యాన్స్ ఫిదా!

Actress Workouts

Actress Workouts: గ్లామర్ క్వీన్స్ అంటే ఫిట్‌ గా ఉండాల్సిందే. ఫిట్‌నెస్‌ తగ్గినా.. షేపౌట్‌ అయినా సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయడం కష్టమే. అందుకే టైమ్‌ దొరికితే జిమ్‌లో, ఫిట్‌నెస్‌ సెంటర్లలో గడుపుతున్నారు హీరోయిన్స్. ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా కష్టపడుతూ చెమటోడుస్తుంటారు. కొత్తగా ఫ్యాన్స్ కు జిమ్ పాఠాలు కూడా నేర్పిస్తున్నారు.

Star Hero’s Remuneration: అమాంతం రేట్ పెంచేస్తున్న స్టార్ హీరోలు?!

హాట్ లుక్ లో.. గ్లామరస్ గా కనిపించేందుకు.. హెల్తీ లైఫ్ ను లీడ్ చేసేందుకు బాగా కష్టపడుతున్నారు హీరోయిన్స్. అందాలతో కుర్రకారును చిత్తు చేసేముందు.. వర్కవుట్స్ తో ముందు వాళ్లు చెమటోడొస్తున్నారు. ప్రెజెంట్ టాప్ హీరోయిన్స్ ఎవ్వరినీ తీసుకున్నా.. జై జిమ్ అనేస్తున్నారు. వర్కవుట్ వీడియోస్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు. అవసరమైతే క్లాసులు కూడా తీసుకుంటున్నారు.

Aha OTT: తెలుగు మోస్ట్ వాంటెడ్ ఓటీటీ ఆహా.. త్వరలో తమిళంలో!

గత కొంతకాలంగా షూటింగ్స్ తో, పర్సనల్ ఇష్యూస్ తో జిమ్ కి దూరమైన సామ్.. మళ్లీ జనవరి ఫస్ట్ నుంచి రెగ్యులర్ వర్కవుట్ చేస్తుంది. ఫ్యాన్స్ తో వరుసగా జిమ్ వీడియోస్ షేర్ చేస్తున్న సమంతా.. రీసెంట్ గా లెవల్ అప్ అనే కొత్త వర్కవుట్ చేసి తన ఫ్రెండ్స్ కి ఛాలెంజ్ విసిరింది. హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్, మేకప్ ఆర్టిస్ట్ రంభియా, ప్రీతమ్ జుకల్కర్‌.. వీరిలో ఏ ఒక్కరు కూడా ఛాలెంజ్‌ను పూర్తి చేయలేకపోయారు. ఇక తనకి ఇష్టమైనవి తినాలంటే ముందు శరీరంలోని క్యాలరీస్‌ కరిగించి ఆ తర్వాత లాగిస్తుందట సామ్. మనం తినే ఆహారాన్ని బట్టే మన శరీరం, మన ఆలోచనలు, మన మనసు ఉంటాయని చెప్పుకొచ్చింది.

BBB: బాలయ్య-బోయపాటి-బన్నీ మల్టీస్టారర్.. రచ్చ రచ్చేనా?

షూటింగ్‌ ల నుంచి కాస్త గ్యాప్‌ దొరకడంతో ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టింది పూజా హెగ్డే. పాపులర్‌ ఇంటర్నేషనల్‌ ట్రైనర్‌ సమీర్‌ పురోహిత్‌ ఇన్ స్ట్రక్షన్స్ తో ట్రైన్‌ అవుతుంది బుట్టబొమ్మ. రీసెంట్ గా స్లో మోషన్‌ వర్కౌట్‌ చేస్తూ.. ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసింది. ఈ స్లోమోషన్‌ వర్కౌట్స్ వల్ల ఎనర్జీ, స్ట్రెంన్త్ ని పొందడం సాధ్యమంటుంది పూజా. `స్లో అండ్‌ కంట్రోల్డ్ మూవ్‌ మెంట్‌.. మీరు కూడా నెక్ట్స్ టైమ్‌ ట్రై చేయండంటూ పోస్ట్ పెట్టింది.