Theater Release Films: ఊరించి ఉడికించి ఈ వారం థియేటర్‌లో వచ్చేస్తున్న సినిమాలు!

అఖండ బాక్సాఫీస్ కి ఫుల్ బూస్టప్ ఇచ్చింది. బాలయ్య ఇచ్చిన ఎనర్జీతో బరిలోకి దిగుతున్నారు టాలీవుడ్ స్టార్స్. కొవిడ్ తర్వాత ఎన్నో వాయిదాలు పడ్డ కీర్తి సురేశ్..

Theater Release Films: ఊరించి ఉడికించి ఈ వారం థియేటర్‌లో వచ్చేస్తున్న సినిమాలు!

Theater Release Films

Theater Release Films: అఖండ బాక్సాఫీస్ కి ఫుల్ బూస్టప్ ఇచ్చింది. బాలయ్య ఇచ్చిన ఎనర్జీతో బరిలోకి దిగుతున్నారు టాలీవుడ్ స్టార్స్. కొవిడ్ తర్వాత ఎన్నో వాయిదాలు పడ్డ కీర్తి సురేశ్, నాగశౌర్య సినిమాలిప్పుడు ఓకేసారి థియేటర్స్ కొచ్చేస్తున్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన కీర్తి సురేశ్ గుడ్ లక్ సఖి.. ఎట్టకేలకు డిసెంబర్ 10న డేట్ ఫిక్స్ చేసుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి బంజారా అమ్మాయిగా కనిపించనుంది. షూటర్ గా మారిన విలేజ్ గర్ల్ ఎమోషనల్ డ్రామాగా నగేశ్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్లస్ పాయింట్. ఆది పినిశెట్టి కీ రోల్ చేసిన ఈ మూవీ తెలుగుతో పాటూ తమిళ్, మలయాళ భాషల్లో ఒకేసార రిలీజ్ కాబోతుంది.

SSMB 28: క్రేజీ అప్డేట్.. మహేష్-త్రివిక్రమ్ సినిమాలో సంజయ్ పాత్ర ఇదే?

కీర్తి సురేశ్ గన్ షూట్ వస్తుంటే నాగశౌర్య బాణాలు వదలుతున్నాడు. ఆయన హీరోగా ఆర్చరీ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా లక్ష్య సినిమా డిసెంబర్ 10నే హాళ్లకి వచ్చేస్తుంది. ఈ సినిమాపై బాగానే ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నాడు శౌర్య. లక్ష్య కోసం ఫుల్ గా వర్కవుట్స్ చేసి బాడీలో మేకొవర్ చూపించిన శౌర్య… లక్ష్య మూవీ తన కెరీర్ లో బెస్ట్ అని చెప్తున్నాడు. ఇక హీరోయిన్ గా హాట్ గర్ల్ కేతికా శర్మ నటించింది. కాలభైరవ సంగీతం అందించిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

Radhe Shyam: ప్రమోషన్స్ స్పీడప్.. మరో సింగిల్ వచ్చేస్తుంది!

ఇండియాలో ఫస్ట్ టైమ్ మడ్ రేస్ ఆధారంగా రాబోతున్న సినిమా “మడ్డీ”. యువన్, రిధాన్ కృష్ణ లీడ్ రోల్స్ చేసారు. ఈ మూవీ డిసెంబర్ 10న సౌత్ లాంగ్వెజెస్ అన్నింటితో పాటూ హిందీ, ఇంగ్లీషుతో సహా 6 భాషల్లో విడుదలకి సిద్దం అవుతోంది. కాగా డాక్టర్ ప్రగాభల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందించటం విశేషం.

Manasanamaha: ఆస్కార్‌కు నామినేటైన తొలి తెలుగు షార్ట్ ఫిల్మ్.. దీని ప్రత్యేకత ఏంటంటే?

బాలీవుడ్ న్యాచురల్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా.. కొత్త వేరియేషన్స్ చూపిస్తున్నాడు. నయా ఫిల్మ్ చండీఘర్ కరే ఆషిఖీ మూవీలో సాలిడ్ బాడీతో ప్రొజెక్ట్ అవుతూనే వాణీకపూర్ తో డీప్ రొమాన్స్ సీన్స్ లో హాట్ రచ్చ చేసాడు. ఈ రొమాంటిక్ ఫ్లిక్ డిసెంబర్ 10న బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అభిషేక్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికే ఆడియెన్స్ ట్రాక్ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాయి. అభయ్ డియోల్, మౌనీరాయ్ జంటగా నటించిన వెల్లె మూవీ ఈ శుక్రవారమే బాలీవుడ్ థియేటర్స్ లో సందడి చేయబోతుంది. అజయ్ దేవగణ్ ప్రొడక్షన్స్ లో దెవెన్ ముంజల్ ఈ మూవీని డైరెక్ట్ చేసాడు. కామెడీ, సన్పెన్స్, క్రైమ్ వంటి ఎలిమెంట్స్ తో ఫుల్ మీల్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు వెల్లె మేకర్స్.