Unstoppable 2: బాలయ్య టాక్ షోలో మ్యాచో స్టార్ స్పెషల్ ఎంట్రీ.. ఒరేయ్ అంటూ ప్రభాస్ బెదిరింపు!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్-2 టాక్ షోకు పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై బాలయ్యతో చేసిన సందడి మనం చూస్తూ వస్తున్నాం. ఇక ఈ టాక్ షోకు సంబంధించిన తాజా ఎపిసోడ్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపీచంద్‌లు గెస్టులుగా హాజరవుతున్నారు. వీరిద్దరు ఈ టాక్ షోకు వస్తున్నారనే వార్తతో ఈ ఎపిసోడ్‌కు అదిరిపోయే హైప్ క్రియేట్ అయ్యింది.

Unstoppable 2: బాలయ్య టాక్ షోలో మ్యాచో స్టార్ స్పెషల్ ఎంట్రీ.. ఒరేయ్ అంటూ ప్రభాస్ బెదిరింపు!

Gopichand Special Entry With Prabhas In Balakrishna Unstoppable 2

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్-2 టాక్ షోకు పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై బాలయ్యతో చేసిన సందడి మనం చూస్తూ వస్తున్నాం. ఇక ఈ టాక్ షోకు సంబంధించిన తాజా ఎపిసోడ్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపీచంద్‌లు గెస్టులుగా హాజరవుతున్నారు. వీరిద్దరు ఈ టాక్ షోకు వస్తున్నారనే వార్తతో ఈ ఎపిసోడ్‌కు అదిరిపోయే హైప్ క్రియేట్ అయ్యింది.

Unstoppable 2: అన్‌స్టాపబుల్‌లో పాన్ ఇండియా స్టార్.. నెక్ట్స్ లెవెల్ అంటోన్న ఫ్యాన్స్

ఇటీవల ఈ తాజా ఎపిసోడ్‌కు సంబంధించి ఓ ప్రోమో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు నిర్వాహకులు. అందులో బాలయ్యతో ప్రభాస్ చేసే సందడిని మనకు చూపించారు. ఇక తాజాగా మరో ప్రోమో గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయగా, ఇందులో మ్యాచో స్టార్ గోపీచంద్ ఎంట్రీని చూపించారు. బాలయ్యతో సరదాగా మాట్లాడుతూ.. ‘‘2008 కాదు సార్ అది..’’ అని ఏదో విషయాన్ని చెప్పేందుకు గోపీచంద్ ప్రయత్నించగా.. పక్కనే ఉన్న ప్రభాస్.. ‘ఒరేయ్..’ అంటూ ఆయన్న సరదాగా బెదిరించారు.

Prabhas: బాలయ్య షోలో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా..?

ప్రస్తుతం దీనికి సంబంధించిన తాజా ప్రోమో గ్లింప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ ఎపిసోడ్‌ను ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మరి ప్రభాస్, గోపీచంద్‌లు బాలయ్యతో ఎలాంటి ముచ్చట్లు పంచుకున్నారో చూడాలి.