Prabhas: బాలయ్య షోలో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా..?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్-2’ టాక్ షో ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ టాక్ షోలో పలు రంగాలకు చెందిన ప్రముఖులను గెస్టులుగా పిలుస్తూ వారితో బాలయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక తాజాగా ఈ టాక్ షోకు సంబంధించిన 5వ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్‍‌కు రెడీ చేశారు నిర్వాహకులు. ఈ తాజా ఎపిసోడ్‌కు గెస్టులుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపీచంద్‌లు వచ్చారు.

Prabhas: బాలయ్య షోలో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా..?

Prabhas Multicolor Shirt In Unstoppable 2 Becomes Hot Topic

Prabhas: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్-2’ టాక్ షో ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ టాక్ షోలో పలు రంగాలకు చెందిన ప్రముఖులను గెస్టులుగా పిలుస్తూ వారితో బాలయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక తాజాగా ఈ టాక్ షోకు సంబంధించిన 5వ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్‍‌కు రెడీ చేశారు నిర్వాహకులు. ఈ తాజా ఎపిసోడ్‌కు గెస్టులుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపీచంద్‌లు వచ్చారు.

Unstoppable 2: అన్‌స్టాపబుల్‌లో పాన్ ఇండియా స్టార్.. నెక్ట్స్ లెవెల్ అంటోన్న ఫ్యాన్స్

అయితే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫోటోలు, తాజాగా ఓ టీజర్ ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. ఈ ఫోటోల్లో, ప్రోమో గ్లింప్స్‌లో ప్రభాస్ మల్టీకలర్ షర్ట్‌లో మెరిసిపోతున్నాడు. ఆయన ఎంట్రీ సినిమా ఈవెంట్‌కు ఏమాత్రం తీసిపోకుండా గ్రాండ్‌గా ప్లాన్ చేసింది ఆహా. ఇక బాలయ్య ఈ ఇద్దరు హీరోలతో ఓ రేంజ్‌లో సందడి చేశాడు. బాలయ్య ప్రభాస్‌ను తన దగ్గరికి రమ్మంటే భయపడుతూ వెనక్కి వెళ్లినట్లుగా ప్రభాస్‌ను మనం ఈ వీడియో గ్లింప్స్‌లో చూడొచ్చు. అయితే ఈ ప్రోమోలో అన్నిటికంటే కూడా హాట్ టాపిక్‌గా మారింది ప్రభాస్ వేసుకున్న షర్ట్.

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ స్పెషల్ గ్లింప్స్ ఇవాళ రాబోతుంది.. రెడీగా ఉండండి!

అవును.. ఈ షో కోసం ప్రభాస్ ఓ మల్టీకలర్ షర్ట్ వేసుకుని వచ్చాడు. అయితే ప్రభాస్ వేసుకున్న ఈ షర్ట్ ప్రముఖ బ్రాండ్ రాల్ఫ్ లారెన్‌కు చెందిందని.. దీని ధర ఏకంగా రూ.11 వేలు ఉంటుందని తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. అయినా బాహుబలితో తన రేంజ్ ఏమిటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన ప్రభాస్ ఇలాంటి షర్ట్ ధరించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ఆయన అభిమానులు అంటున్నారు. ఇక ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారగా, ఈ ఎపిసోడ్‌ను డిసెంబర్ 31న న్యూ ఇయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. మరి నిజంగానే అప్పటివరకు ఈ ఎపిసోడ్‌ను హోల్డ్‌లో పెడతారా లేక, అంతకు ముందే స్ట్రీమింగ్ చేస్తారా అనేది చూడాలి.