Hari Hara Veera Mallu : ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. రెండు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు..

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘భీమ్లా నాయక్’ మూవీ రిలీజ్ ఫిక్స్ అయ్యింది.. రెండు నెలల గ్యాప్‌లో మరో సినిమా విడుదల కాబోతుండడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు..

Hari Hara Veera Mallu : ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. రెండు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు..

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో.. ఎ.దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ.. ‘హరి హర వీరమల్లు’.. (Legendary Heroic Outlaw).. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Pawan Kalyan : పవర్‌స్టార్.. క్రేజ్‌కి కేరాఫ్..

ఇక సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు స్పెషల్‌గా ఈ సినిమా నుండి ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది టీమ్. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 29న రిలీజ్ చెయ్యనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘భీమ్లా నాయక్’ మూవీ రిలీజ్ ఫిక్స్ అయ్యింది. రెండు నెలల గ్యాప్‌లో మరో సినిమా విడుదల కాబోతుండడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Hari Hara Veera Mallu : డెడికేషన్ అంటే ఇదీ.. ‘హరి హర వీరమల్లు’ కోసం పవన్ ప్రాక్టీస్..

పవన్ పక్కన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంటడగా.. బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రల్లో కనిపించనుంది. స్వరవాణి ఎం.ఎం. కీరవాణి సంగీత మందిస్తున్నారు. పవర్‌స్టార్ కెరీర్‌లో మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘హరి హర వీర మల్లు’ భారీ స్థాయిలో విడుదల కానుంది.