Pawan Kalyan : పవర్‌స్టార్.. క్రేజ్‌కి కేరాఫ్..

‘పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్’ అనే పేరు కనబడితే థియేటర్లు జాతర్లను తలపిస్తాయి.. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు..

Pawan Kalyan : పవర్‌స్టార్.. క్రేజ్‌కి కేరాఫ్..

Pawan

Pawan Kalyan: ‘పవర్‌స్టార్’.. ఇది కేవలం పవన్ కళ్యాణ్ పేరుకి ముందు ఉండే బిరుదు మాత్రమే కాదు.. ‘పవర్‌స్టార్’ అంటే క్రేజ్‌కి కేరాఫ్.. ‘కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు’ అన్నట్లు ఆయన కటౌట్ కనిపిస్తే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కనక వర్షం కురుస్తుంది. స్క్రీన్ మీద ‘పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్’ అనే పేరు కనబడితే థియేటర్లు జాతర్లను తలపిస్తాయి.. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఇక తన స్టైల్లో మెడ మీద చెయ్యి పెట్టి రుద్దుతూ ఒక లుక్ ఇస్తే.. ఆ కిక్కే వేరప్పా..

Pk

పవర్‌స్టార్ పుట్టినరోజు..
1971 సెప్టెంబర్ 2న కొణిదెల కళ్యాణ్ బాబు.. కొణిదెల వెంకట్రావు – అంజనా దేవి దంపతులకు.. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో జన్మించారు. చిన్నతనంలో అందరిలానే చదువు కొనసాగించినా.. తన చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల అవగాహన ఏర్పరచుకోవడం.. సమాజాన్ని మేల్కొల్పుతూ ప్రజలను చైతన్య పరిచే పుస్తకాలు చదవడం అలవాటుగా మారింది. ఇంటర్మీడియట్‌తో కళ్యాణ్ చదువు ఆపేశారు.

Mega Brothers : మెగా బ్రదర్స్ పిక్ అదిరిందిగా..!

కరాటేలో బ్లాక్ బెల్ట్..
మార్షల్ ఆర్ట్స్ మీద మక్కువతో కఠినమైన ఆ విద్యను నేర్చుకుని.. కరాటేలో బ్లాక్ బెల్ట్ పొందారు కళ్యాణ్. అప్పుడే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సతీమణి, వదిన సురేఖ సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించారు. దీనికి చిరు, నాగబాబుతో సహా ఫ్యామిలీ అంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. నటనలో శిక్షణ పొందారు. అయితే అప్పుడు మెగా కుటుంబ సభ్యులు కానీ అల్లు కుటుంబ సభ్యులు కానీ అంతెందుకు, కళ్యాణ్ కానీ తాను ఒక హిస్టరీ క్రియేట్ చేసే పర్సన్‌గా ఎదుగుతాడని ఎక్స్‌పెక్ట్ చేసుండరు.

Pawan With Kids

ఫస్ట్ సినిమాతోనే అదుర్స్ అనిపించారు..వదిన ప్రోత్సాహంతో నటనలో ట్రైనింగ్ పూర్తయ్యాక మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కళ్యాణ్‌ని హీరోగా పరిచయం చెయ్యడానికి ముందుకొచ్చారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన పవన్ ఫస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’..

Akkada Ammayi Ikkada Abbayi

ఈ సినిమాతోనే అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది. 1996 అక్టోబర్ 11న మెగాస్టార్ చిరంజీవి రెండో తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్. ఈ సినిమా ప్రమోషన్స్ కానీ పవన్ చేసిన మార్షల్ ఆర్ట్స్ కానీ అప్పట్లో ఓ సెన్సేషన్.

Pawan Martial Arts

వరుసగా ఏడు సినిమాలు సూపర్‌హిట్స్..
తర్వాత ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. కరుణాకరన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. పవన్ చేసిన లవ్ అండ్ ఫ్యామిలీ ఫిలిం ‘తొలిప్రేమ’ ఆయన కెరీర్‌కి బిగ్ బ్రేక్ ఇచ్చింది.. ఆ సినిమాతో కెరీర్ టర్న్ అయిపోయింది. చిరంజీవి తమ్ముడిగానే కాక పవన్ కళ్యాణ్‌గానూ అభిమానుల్ని సంపాదించుకున్నారు.

Tholiprema

‘ఖుషీ’ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ..
‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’ ఒకదాన్ని మించి ఒకటి సూపర్ డూపర్ హిట్స్.. ‘ఖుషి’ ఏకంగా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. స్టార్‌డమ్ మాత్రమే కాదు.. కళ్యాణ్ క్రేజ్ పిచ్చ పీక్స్‌కెళ్లింది. ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయారు. అదే టైంలో ‘జానీ’ తో డైరెక్టర్‌గా మారారు. అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఫలితం పవన్‌తో పాటు ఆయన అభిమానులనూ కాస్త నిరాశ పరిచింది. దీంతో తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లించి గొప్ప మనసు చాటుకున్నారు.

Kushi : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ ‘ఖుషి’ @ 20..

పవన్ హిట్ కొడితే ఆ కిక్కే వేరప్పా..
తర్వాత అన్నయ్య నాగబాబు నిర్మాతగా ‘గుడుంబా శంకర్’ చేశారు. ఈ సినిమాకి పవన్ స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ‘బాలు’, ‘బంగారం’, ‘అన్నవరం’ సినిమాలు కాస్త నిరాశ పరిచినా.. ‘జల్సా’ తో సూపర్ హిట్ కొట్టారు. ‘కొమరం పులి’, ‘తీన్‌మార్’, ‘పంజా’ సినిమాలతో ఇంకాస్త అసంతృప్తిగా ఉన్న పవన్ ఎలాగైనా హిట్ కొట్టి తీరాలి అనుకున్న టైం లో ‘గబ్బర్ సింగ్’ చేశారు. ‘జస్ట్ టైం గ్యాప్’ అంతే అనే రేంజ్‌లో సినిమా బాక్సాఫీస్‌ని షేకాడించింది.

Gabbar Singh

సినిమాలకు సెలవు..
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ తర్వాత ‘ అత్తారింటికి దారేది’ తో మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టి తనకు తానే సాటి అనిపించుకున్నారు. విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘గోపాల గోపాల’ లాంటి మల్టీస్టారర్‌లో కృష్ణుడిగా ఆకట్టుకున్నారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’, ‘అజ్ఞాతవాసి’ సినిమాల తర్వాత పవన్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు.

Pawan

జనం కోసం జనసేన..
సినిమాలు పక్కన పెట్టి.. కుళ్లు పట్టిన రాజకీయ వ్యవస్థతో పాటు సమాజంలో మార్పు తీసుకురావాలని నిశ్చయించుకుని ‘జనసేన’ పార్టీ స్థాపించారు. అభిమానులంతా ఆయన వెంట అడుగులేశారు. ఫలితం పక్కన పెడితే రాజకీయాల్లో ‘జనసేన’ తో పెను మార్పు తీసుకొచ్చారు పవర్‌స్టార్..

Janasena

జస్ట్ టైం గ్యాప్ అంతే.. రీ ఎంట్రీతో రికార్డుల మోత..
25వ సినిమా తర్వాత బ్రేక్ ఇచ్చిన పవన్ 26వ సినిమా ‘వకీల్ సాబ్’ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసేశారు. పవన్ రీ ఎంట్రీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడ్డానికి తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
పాండమిక్ పరిస్థితులు లేకపోతే థియేటర్లలో కలెక్షన్ల లెక్క వేరేలా ఉండేది. ఓటీటీలోనూ ‘వకీల్ సాబ్’ సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

Vakeel Saab

పవన్ గొంతెత్తితే.. కాలు కదపాల్సిందే..
మొట్టమొదటి సారిగా ‘తమ్ముడు’ సినిమా కోసం పవన్ సింగర్‌గా మారారు. ‘తాటిచెట్టెక్కలేవు’.. ‘ఏం పిల్లా’ అనే రెండు బిట్ సాంగ్స్ పాడి ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియె‌న్స్‌లో జోష్ నింపారు. తర్వాత ‘ఖుషి’ లో ‘బై బయ్యే బంగారు రమణమ్మ’ అనే మరో బిట్‌తో అదరగొట్టేశారు. ‘జానీ’ మూవీలో ‘నువ్వు సారా తాగుట మానురన్నో’, ‘రావోయి మా కంట్రికి’ (బిట్), ‘కిళ్లీ కిళ్లీ’ (గుడుంబా శంకర్), ‘పాపా రాయుడా’ (పంజా), ‘కాటమరాయుడా.. కదిరి నరసింహుడా’ (అత్తారింటికి దారేది), ‘కొడకా కోటేశ్వర్రావా’ (అజ్ఞాతవాసి) సినిమాల్లో తన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు పవర్‌స్టార్.. అన్నయ్య చిరంజీవి నటించిన హిస్టారికల్ ఫిలిం ‘సైరా’ నరసింహా రెడ్డి కి వాయిస్ ఓవర్ ఇచ్చారు.

Pawan Singing

కొరియోగ్రఫర్‌గా..
పాడడంతోనే కాదు డ్యాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేసి కూడా అలరించారు పవన్. ‘ఖుషి’ లో ‘అమ్మాయే సన్నగా’, ‘గజ్జ ఘల్లు’ పాటలు మినహా అన్ని పాటలకూ కొరియోగ్రఫీ చేశారు పవన్. ‘గుడుంబా శంకర్’ సినిమాలో సింగిల్ కార్డ్ డ్యాన్స్ మాస్టర్ పవర్ స్టారే.. ‘పంజా’ టైటిల్ సాంగ్‌లో స్టైలిష్ మూమెంట్స్ కంపోజ్ చేశారు.

Pawan Dance

తెర వెనుక..
యాక్టింగ్, సింగింగ్ మాత్రమే కాదు.. పవన్‌లో రైటింగ్ టాలెంట్ కూడా ఉంది. ‘జానీ’ కి రైటర్, డైరెక్టర్ పవనే. తర్వాత ‘గుడుంబా శంకర్’ కి స్క్రీన్‌ప్లే ఇచ్చారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కథనందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. తన డై హార్డ్ ఫ్యాన్, యంగ్ హీరో నితిన్‌తో ‘ఛల్ మోహన్ రంగ’ సినిమా తీశారు.

Pawan Writing

పవన్ ఫైట్స్‌కి కూడా ఫ్యాన్స్..
‘తమ్ముడు’ సినిమాలో ఫస్ట్ టైం ఫైట్స్ కంపోజ్ చేశారు పవర్‌స్టార్.. ‘బద్రి’, ‘ఖుషి’, ‘జానీ’ ‘గుడుంబా శంకర్’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలతో పాటు అన్నయ్య చిరంజీవి నటించిన ‘డాడీ’ లోనూ పవన్, స్టైలిష్ అండ్ డిఫరెంట్ ఫైట్స్ కంపోజ్ చేశారు.

Pawan Fights

నాన్‌స్టాప్ నాలుగు సినిమాలు..
రీ ఎంట్రీలో స్పీడ్ పెంచిన పవన్.. వరుసగా సినిమాలు లైనప్ చేస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్షన్లో రానా దగ్గుబాటితో కలిసి నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తున్న ప్రెస్టీజియస్ పీరియాడికల్ డ్రామా ‘హరి హర వీర మల్లు’, దాని తర్వాత ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్‌తో, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిలతో సినిమాలు ప్లాన్ చేశారు పవర్ స్టార్‌పవన్ కళ్యాణ్..