Kushi : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ ‘ఖుషి’ @ 20..

బ్లాక్ బస్టర్ తమిళ్ ‘ఖుషి’ రీమేక్‌గా తెరకెక్కి తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి, యూత్‌లో ‘పవర్‌స్టార్’ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్‌ను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టిన మూవీ ‘ఖుషి’ విడుదలై నేటితో 20 సంవత్సరాలు పూర్తవుతున్నాయి..

Kushi : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ ‘ఖుషి’ @ 20..

Kushi

Kushi: 2001 సంవత్సరం ఏప్రిల్ 27వ తేది.. కాలేజ్‌లన్నీ ఖాళీగా ఉన్నాయి.. స్టూడెంట్స్‌తో థియేటర్లన్నీ నిండిపోయాయి.. తమ అభిమాన హీరో సినిమాకి టికెట్స్ తెచ్చి అమ్మాయిల దగ్గర హీరో అయిపోవాలని కుర్రాళ్లంతా క్యూలు కట్టారు.. థియేటర్స్ దాటి రోడ్ల మీద వరకు లైన్ ఉండేదంటే యాత్‌లో ఆ హీరో క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోండి..
అప్పటికి ఆ హీరో నటించిన ఆరు సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి.. డబుల్ హ్యాట్రిక్‌తో ఊపు మీద ఉన్న హీరో నుండి ఏడవ సినిమా వచ్చింది.. సాలిడ్ హిట్ కొట్టింది.. ఆ క్రేజీయెస్ట్ స్టార్ ‘పవర్‌స్టార్’..

Khushi

బ్లాక్ బస్టర్ తమిళ్ ‘ఖుషి’ రీమేక్‌గా తెరకెక్కి తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి, యూత్‌లో ‘పవర్‌స్టార్’ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్‌ను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టిన మూవీ ‘ఖుషి’ విడుదలై నేటితో 20 సంవత్సరాలు పూర్తవుతున్నాయి.. ప్రముఖ నిర్మాత, శ్రీ సూర్య మూవీస్ అధినేత ఎ.ఎమ్. రత్నం నిర్మించగా, తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు..

Kushi

‘పవర్‌స్టార్’ అండ్ బ్యూటిఫుల్ భూమికల పెర్ఫార్మెన్స్, మణిశర్మ మ్యాజికల్ మ్యూజిక్, లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ విజువల్స్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి..
ఇండస్ట్రీ హిట్ కొట్టి, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మెమరబుల్ మూవీగా మిగిలిన క్లాసికల్ ‘ఖుషి’ మూవీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘పవర్‌స్టార్’ ఫ్యాన్స్, మూవీ లవర్స్ #20YearsForClassicIHKushi హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు..

 

Kushi