Telangana Heavy Rains : తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

Meteorological Department Red Alert : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక 16 జిల్లాలకు అధికారులు అరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

GHMC : వర్షాల ప్రభావం .. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సెలవులు రద్దు

మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్. జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,
హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వ్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం, గురువారం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. బుధవారం కూడా నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Hyderabad Rain : హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్.. ఆ జోన్‌ల పరిధిలో భారీ వర్షాలు.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు

హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి నీటిని మూసిలోకి విడుదల చేస్తున్నారు. ఇక ఉస్మాన్ సాగర్ కు కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. 17 వందల క్యూసెక్కు నీరు ఉస్మాన్ సాగర్ లోకి వచ్చి చేరుతోంది.

ట్రెండింగ్ వార్తలు