దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి: మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu: నీట్ నిర్వహణలో కేంద్ర సర్కారు పూర్తిగా విఫలమైందని అన్నారు. గ్రేస్ మార్కులను కలపడంపై..

Sridhar Babu

నీట్ పరీక్ష నిర్వహణలో విద్యార్థులకు అన్యాయం జరిగిందని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. నీట్ దరఖాస్తుల స్వీకరణ పొడగింపుపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

అలాగే, ముందుగా అనుకున్నదాని కంటే 10 రోజుల ముందే ఫలితాలు విడుదల చేయడంపై కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఏకంగా అంత మంది విద్యార్థులకు ఒకటో ర్యాంక్ రావడం ఏంటని నిలదీశారు. నీట్‌లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పారు.

నీట్ నిర్వహణలో కేంద్ర సర్కారు పూర్తిగా విఫలమైందని అన్నారు. గ్రేస్ మార్కులను కలపడంపై సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టిందని తెలిపారు. రాష్ట్రంతో పాటు కేంద్రానికి చెందిన ఆణిముత్యం సింగరేణి అని చెప్పారు. దానికి కొత్తగా గనులు కేటాయించడంపై కిషన్ రెడ్డి దృష్టి పెట్టాలని అన్నారు. దేశంలోని బొగ్గు నిక్షేపాలను ప్రభుత్వ సంస్థలకు కేటాయించాలని చెప్పారు.

సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమంటూనే కొత్తగనులను ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు కేటాయిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సింగరేణిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే మోదీని కలిసి ప్రభుత్వ వైఖరిని చెబుతారని తెలిపారు. టీడీపీని బీఆర్ఎస్ ఫాలో అవుతున్నట్లుందని అన్నారు. ఏపీ నుండి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదని చెప్పారు. బీఆర్ఎస్ వైఖరిని మార్చుకోవాలని అన్నారు.

Also Read: మోకాళ్లపై కూర్చొని అమరావతి శంకుస్థాపన వేదికకు ప్రణమిల్లిన చంద్రబాబు.. వీడియో

ట్రెండింగ్ వార్తలు