మోకాళ్లపై కూర్చొని అమరావతి శంకుస్థాపన వేదికకు ప్రణమిల్లిన చంద్రబాబు.. వీడియో

Chandrababu Naidu: ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణాలను..

మోకాళ్లపై కూర్చొని అమరావతి శంకుస్థాపన వేదికకు ప్రణమిల్లిన చంద్రబాబు.. వీడియో

Updated On : June 20, 2024 / 3:05 PM IST

రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. తన రెండో క్షేత్ర స్థాయి పర్యటనను రాజధానిలో చేపట్టారు. ఉండవల్లిలో వైసీపీ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను ప్రారంభించారు. ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మోకాళ్లపై కూర్చొని ఉద్దండరాయుని పాలెంలో శంకుస్థాపన వేదికకు ప్రణమిల్లారు. నీరు-మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతాన్ని సందర్శించారు. కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. జై అమరావతి, జై చంద్రబాబు అంటూ అమరావతి రైతులు నినాదాలు చేశారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపన శిలా ఫలకాన్ని చంద్రబాబు సందర్శించారు. నాడు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన యాగశాలను కూడా సందర్శించారు చంద్రబాబు. గృహ సముదాయాలను పరిశీలించారు.

నిర్మాణం పూర్తైన రూములను చంద్రబాబు సందర్శించారు. అలాగే, తానొస్తున్నానని ప్రత్యేక ఏర్పాట్లేం చేయలేదు కదా? అని అధికారులను చంద్రబాబు అడిగారు. రాజధాని నిర్మాణ పనుల వాస్తవ పరిస్థితి తనకు తెలియాలని చెప్పారు. ప్రజా ప్రతినిధుల క్వార్టర్ల నిర్మాణం దాదాపు 70-80 శాతం మేర పూర్తయింది. రూ. 421 కోట్లతో, 1,46,240 చదరపు మీటర్లల్లో నిర్మాణం జరుగుతోంది.
12 టవర్లల్లో ప్రజా ప్రతినిధుల నివాస సముదాయం ఉంటుంది.

Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఏమని పోస్ట్ చేశారంటే..