Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఏమని పోస్ట్ చేశారంటే..

అయిదు వారాల క్రితం పవన్ కళ్యాణ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టగా మళ్ళీ ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేశాక, డిప్యూటీ సీఎం అయ్యాక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ షేర్ చేశారు.

Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఏమని పోస్ట్ చేశారంటే..

Pawan Kalyan Shares first Instagram Post after taking Charge as Deputy CM

Pawan Kalyan : ఏపీ ఎన్నికల్లో జనసేన, పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించగా టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఇక పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రితో పాటు మంత్రిగా కూడా పలు శాఖలు కేటాయించారు. నిన్నే పవన్ కళ్యాణ్ విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు.

అయితే పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా ఉన్నా ఎక్కువగా పోస్టులు పెట్టరు. పవన్ రాజకీయాలకు సంబంధించినవి అన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ నుంచే వస్తాయి. పవన్ సొంత సోషల్ మీడియా అకౌంట్స్ లో మాత్రం చాలా అరుదుగా పోస్టులు పెడుతూ ఉంటారు. ఎన్నికల ప్రమోషన్స్ కూడా పవన్ తన సొంత సోషల్ మీడియా అకౌంట్స్ లో చేయలేదు.

Also Read : Klin Kaara Photos : క్లిన్ కారా ఫస్ట్ బర్త్‌డే.. ఇప్పటివరకు బయటకు వచ్చిన క్లిన్ కారా ఫొటోలు ఇవే..

అయిదు వారాల క్రితం పవన్ కళ్యాణ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టగా మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేశాక, డిప్యూటీ సీఎం అయ్యాక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ షేర్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోని పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి తన ఛాంబర్ కు రావడం, పూజలు నిర్వహించడం, ఫైల్స్ మీద సంతకాలు చేయడం, పలువురు అధికారులను కలవడం.. ఇవన్నీ చూపించారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ దానికి సంబంధించిన వీడియోలో తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర & సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు గౌరవంగా ఉంది. ఇప్పుడు నా బాద్యతలు మరింత పెరిగాయి. నేను నా రాష్ట్రానికి బాధ్యతతో పనిచేస్తాను. ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను అని పోస్ట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక మొదటి సారి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Pawan Kalyan (@pawankalyan)