Bigg Boss 5: ఫినాలేలో అడుగు పెట్టిన ఐదుగురు కంటెస్టెంట్లు వీళ్ళే!

తెలుగు బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ ఐదవ సీజన్ ముగిసే సమయం దగ్గర పడింది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా ఈ ఆదివారం ఎలిమినేషన్ తో ఐదుగురు మాత్రమే హౌస్ లో ఉంటారు.

Bigg Boss 5: ఫినాలేలో అడుగు పెట్టిన ఐదుగురు కంటెస్టెంట్లు వీళ్ళే!

Bigg Boss 5

Bigg Boss 5: తెలుగు బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ ఐదవ సీజన్ ముగిసే సమయం దగ్గర పడింది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా ఈ ఆదివారం ఎలిమినేషన్ తో ఐదుగురు మాత్రమే హౌస్ లో ఉంటారు. ఈ ఎలిమినేషన్ కూడా ముగిస్తే ఫైనల్స్ మొదలైనట్లే. ఈ ఆదివారం పూర్తయితే మరో వారం రోజులలో షో పూర్తయిపోతుంది. అంటే షోలో ఈ సీజన్ లాస్ట్ ఎలిమినేషన్ కు కూడా సమయం ఆసన్నమైంది. ఈ వారం ఎలిమినేషన్ అయితే మిగిలిన ఆ ఐదుగురిలోనే టైటిల్ విన్నర్ ఉండనున్నారు. అంటే టైటిల్ పోరులో ఒక్క అడుగు మాత్రమే మిగిలి ఉంది.

Salman-Akshay: నువ్వా.. నేనా.. సల్మాన్, అక్షయ్ కలెక్షన్ల పోటీ!

కాగా, ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకులు ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో కూడా ఫిక్స్ అయిపోయారు. యధావిధిగా ప్రతి వారం ముందే లీకు వీరుల ప్రచారం ప్రకారం ఈ వారం ఎలిమినేట్ అయి ఫైనల్స్ మిస్ అయ్యే కంటెస్టెంట్ ఈమెనే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిపోతుంది. ఆ ప్రచారం ప్రకారం ఈ వారం ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ ఆర్జే కాజల్ అంటున్నారు. కాజల్ పై సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం కూడా ఇందుకు కారణం కావచ్చు. మొత్తంగా కాజల్ ఈ వారం ఓటింగ్ లో ఎలిమినేషన్ అయినట్లుగా తెలుస్తుంది.

Anu Emmanuel: అసలే వాలు కళ్ళు.. ఆపై మత్తు చూపు!

కాజల్ ఎలిమినేషన్ అనంతరం హౌస్‌లో మిగిలింది ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే. టికెట్‌ టు ఫినాలే గెలుచుకుని శ్రీరామ్‌ మొదటి ఫైనలిస్టుగా నిలవగా శనివారం ఎపిసోడ్‌లో సన్నీ ఫైనల్‌లో అడుగుపెట్టినట్లు ప్రకటన వచ్చేసింది. ఇక మిగిలిన మానస్‌, సిరి, షణ్ను ఆదివారం ఎలిమినేషన్ తర్వాత ఫినాలేలో అడుగుపెట్టనున్నారు. మరి వీరిలో టైటిల్ కొట్టేది ఎవరు.. ఇప్పటి వరకు అందరూ మగవాళ్లే టైటిల్ గెలుచుకోగా ఈ సీజన్ సిరి టైటిల్ కొడుతుందా.. లేక ఈ సీజన్ కూడా మేల్ కంటెస్టెంట్ కే దక్కుతుందా అన్నది చూడాల్సి ఉంది.