Salman-Akshay: నువ్వా.. నేనా.. సల్మాన్, అక్షయ్ కలెక్షన్ల పోటీ!

బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్, అక్షయ్ ఎంత ఫ్రెండ్స్ అయినా.. సినిమాల పరంగా పోటీ ఫస్ట్ నుంచి ఉంది. సల్మాన్ ఆచి తూచి సంవత్సరానికి ఒకటో, రెండో సినిమాలు చేస్తే, అవకాశం వస్తే దెబ్బకి..

Salman-Akshay: నువ్వా.. నేనా.. సల్మాన్, అక్షయ్ కలెక్షన్ల పోటీ!

Salman Akshay

Salman-Akshay: బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్, అక్షయ్ ఎంత ఫ్రెండ్స్ అయినా.. సినిమాల పరంగా పోటీ ఫస్ట్ నుంచి ఉంది. సల్మాన్ ఆచి తూచి సంవత్సరానికి ఒకటో, రెండో సినిమాలు చేస్తే, అవకాశం వస్తే దెబ్బకి 5,6 సినిమాలు రిలీజ్ చేస్తారు అక్షయ్ కుమార్. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు రిలీజ్ చేసిన 5 సినిమాల్లో కలెక్షన్ల పరంగా గట్టి పోటీగా నిలిచాయి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్, అక్షయ్. నా ఫ్లాప్ సినిమాకి కూడా 100కోట్లు వస్తాయనే సల్మాన్ ఖాన్ కి, మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ కి కలెక్షన్ల కాంపిటీషన్ ఓ రేంజ్ లో ఉంటుంది. లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ అన్తిమ్ సినిమాకి, అక్షయ్ కుమార్ సూర్యవన్షీ సినిమాని కూడా ఇలాగే కంపేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Anu Emmanuel: అసలే వాలు కళ్ళు.. ఆపై మత్తు చూపు!

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. నవంబర్ లాస్ట్ వీక్ లో అన్తిమ్ మూవీ రిలీజ్ చేశారు.సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ హీరోలుగా తెరకెక్కిన ఈ మాఫియా యాక్షన్ డ్రామా రిలీజై పర్వాలేదనిపించింది. సల్మాన్ ఖాన్.. ఇప్పటి వరకూ కనిపించిన పోలీస్ గెటప్ లన్నింటికంటే సమ్ థింగ్ డిఫరెంట్ గా సీరియస్ సిక్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. నవంబర్ 26న రిలీజ్ అయిన ఈ సినిమా 40 కోట్లకు మించి కలెక్షన్లు సాధించలేపోయింది. యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ అండ్ టీమ్ వన్ ఇయర్ నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమా సూర్యవన్షీ. రోహిత్ శెట్టి డైరెక్షన్లో భారీ కాప్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీ దీపావళి సీజన్ లో రిలీజ్ అయ్యి 200 కోట్లు కొల్లగొట్టింది. అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్ , కత్రినా కైఫ్ లాంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ కోవిడ్ తర్వాత బాలీవుడ్ లో రిలీజ్ అయ్యి 200 కోట్లు బాక్సాఫీస్ కలెక్షన్లు తెచ్చింది.

Maa Association New Building: వారం రోజుల్లో మా బిల్డింగ్‌పై ప్రకటన

సల్మాన్ ఖాన్ హీరోగా, ప్రభుదేవా డైరెక్షన్లో ద మోస్ట్ వాంటెడ్ భాయ్ రాధే మూవీ కూడా 2021లో రిలీజ్ అయ్యింది. కోవిడ్ ఇంకా సెటిల్ అవ్వకముందే రిలీజ్ అయిన ఈ సూపర్ స్టార్ మూవీ జస్ట్ 20 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించింది. అక్షయ్ కుమార్ కూడా 2021లో బెల్ బాటమ్ రిలీజ్ చేసి 50 కోట్లు మాత్రమే కలెక్ట్ చెయ్యగలిగారు. సల్మాన్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తే.. అక్షయ్ బెల్ బాటమ్ తో స్పై ధ్రిల్లర్ మూవీ చేశారు. అయినా సరే కోవిడ్ ఎఫెక్ట్ తో కలెక్షన్లు అంతగా రాబట్టలేకపోయినా అక్షయ్ మాత్రం సల్మాన్ మీద అప్పర్ హ్యాండ్ సాధించారు.

Pushpa-Samantha: సామ్ ఓ కొడతావా పాటకి భారీ రెస్పాన్స్!

2020లో మాత్రం అక్షయ్ కుమార్ ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యలేదు. కానీ సల్మాన్ సినిమాలు మాత్రం పోటాపోటీగా కలెక్షన్ల దుమ్మురేపాయి. సల్మాన్ ఖాన్ ద కాప్ సిరీస్ దబంగ్ 3తో 200 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్ట్ చేశారు. 100కోట్లతో తెరకెక్కిన దబంగ్ 3 సినిమా 211కోట్లు కలెక్ట్ చేసి మంచి నంబర్ సంపాదించుకుంది. ఇక అక్షయ్ కుమార్, దల్జీత్, కరీనా, కియారా నటించిన సూపర్ ఫన్ ఎంటర్ టైనర్ గుడ్ న్యూస్ మూవీ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా 300కోట్ల మార్క్ దాటి 320 కోట్ల హ్యూజ్ కలెక్షన్లు రాబట్టి అక్షయ్ కుమార్ నే పైన నిలబెట్టింది.

Telugu Film Promotions: టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్.. ఎటు చూసినా ప్రమోషన్ల మోతే..!

సల్మాన్ ఖాన్ పేట్రియాటిక్ రోల్ చేసిన భారత్ సినిమా రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాదించింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా సల్మాన్ ఖాన్ ఎమోషన్ తో ఆకట్టుకున్న భారత్ మూవీ 100 కోట్లతో తెరకెక్కి 325 కోట్లు వసూల్ చేసింది. అక్షయ్ కుమార్ కూడా తనకు కలిసొచ్చిన సూపర్ కామెడీ ఎంటర్ టైన్ హౌజ్ ఫుల్ 4 తో మరోసారి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన హౌజ్ ఫుల్ 4.. 75 కోట్లతో తెరకెక్కి 280 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సారి మాత్రం అక్షయ్ కుమార్ ని బీట్ చేసి సల్మాన్ ఖాన్ ముందుకొచ్చారు.

RRR NTR Bike: తారక్ వాడిన బైక్ కథేంటి? దాని ప్రత్యేకతలేంటి?

సల్మాన్ ఖాన్ ఈసారి తన ఫేవరెట్ యాక్షన్ ఫ్రాంచైజ్ రేస్ 3 తో డబుల్ కలెక్షన్లు సాధించారు. మల్టీస్టారర్ గా భారీ బడ్జెట్ తో పాటు భారీ యాక్షన్ తో తెరకెక్కిన రేస్ 3 సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 300కోట్లు కొల్లగొట్టింది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఈ సారి కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇస్రో బ్యాక్ డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన మిషన్ మంగళ్ సినిమాని సూపర్ సక్సెస్ చేశారు. జస్ట్ 30 కోట్లతో తెరకెక్కిన ఈ స్పేస్ డ్రామా 290 కోట్లు కలెక్ట్ చేసి పెద్ద కమర్షియల్ హిట్ అయ్యింది. పెద్దగా ప్రయోగాలు చెయ్యకుండా సేఫ్ గా కమర్షియల్ సినిమాలు చేసే సల్మాన్ ఖాన్, ఎక్స్ పెరిమెంట్స్ చేస్తూనే కమర్షియల్ సక్సెస్ అందుకుంటున్న అక్షయ్ కుమార్.. ఇలా ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు కలెక్షన్ల విషయంలో నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతూనే ఉన్నారు.