Maa Association New Building: వారం రోజుల్లో మా బిల్డింగ్‌పై ప్రకటన

ఆ మధ్య జరిగిన తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో అందరికీ తెలిసిందే. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్.. మోహన్ బాబు తనయుడు..

Maa Association New Building: వారం రోజుల్లో మా బిల్డింగ్‌పై ప్రకటన

Maa Association New Building

Updated On : December 12, 2021 / 5:08 PM IST

Maa Association New Building: ఆ మధ్య జరిగిన తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో అందరికీ తెలిసిందే. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్.. మోహన్ బాబు తనయుడు విష్ణు ప్యానల్స్ మధ్య జరిగిన ఈ రసవత్తర పోరులో ఫైనల్ గా మంచు విష్ణు గెలుపొందాడు. ఈ ఎన్నికలలో కీలకంగా వినిపించిన అంశాలలో మా అసోసియేషన్ కోసం కొత్త బిల్డింగ్ కూడా ఒకటి. తన సొంత డబ్బుతో ఈ బిల్డింగ్ కట్టిస్తానని విష్ణు ఎన్నికలలో హామీ ఇచ్చాడు.

Pushpa-Samantha: సామ్ ఓ కొడతావా పాటకి భారీ రెస్పాన్స్!

కాగా.. ఎన్నికలు ముగిసి కొత్త ప్యానల్ ఏర్పాటైనా ఈ బిల్డింగ్ అంశం ఎక్కడ వరకు వచ్చిందన్నది ఇప్పటి వరకూ క్లారిటీ లేదని కొంత అసహనం కనిపిస్తూ వచ్చింది. కాగా.. తాజాగా ఈ అంశంపై మాట్లాడిన విష్ణు మరో వారం రోజులలో మా బిల్డింగ్ అంశంపై ప్రకటన వస్తుందని చెప్పాడు. ఈ మధ్యనే మా కమిటీ మీటింగ్ జరిగిందని.. మరో వారం రోజుల్లో మా బిల్డింగ్ పై ప్రకటన చేస్తామని చెప్పుకొచ్చాడు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పోటీ చేసి గెలుపొందిన 11మంది సభ్యులు చేసిన రాజీనామాలను కూడా ఆమోదించారు.

RRR NTR Bike: తారక్ వాడిన బైక్ కథేంటి? దాని ప్రత్యేకతలేంటి?

రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులను రాజీనామాలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరినా అందుకు వారు సిద్ధంగా లేకపోవడంతో నెల రోజుల పాటు వెయిట్ చేసి రాజీనామాలను అంగీకరించినట్లు చెప్పిన విష్ణు.. మా అసోసియేషన్ వర్క్స్ కోసం వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నట్లు చెప్పాడు. అయితే రాజీనామా చేసిన నాగబాబు, ప్రకాష్ రాజుతో సహా రాజీనామా చేసిన వారంతా మా సభ్యులుగా కొనసాగుతారని విష్ణు చెప్పుకొచ్చాడు.