Pushpa-Samantha: సామ్ ‘ఊ కొడతావా’ పాటకి భారీ రెస్పాన్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్.. మూడోసారి తెరకెక్కబోతున్న హిట్ కాంబినేషన్. ఏకంగా 3 వేల ధియేటర్లలో సినిమా రిలీజ్.. ఓవరాల్ గా బొమ్మ బావుందంటున్నారు మేకర్స్.

Pushpa-Samantha: సామ్ ‘ఊ కొడతావా’ పాటకి భారీ రెస్పాన్స్!

Pushpa Samantha

Pushpa-Samantha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్.. మూడోసారి తెరకెక్కబోతున్న హిట్ కాంబినేషన్. ఏకంగా 3 వేల ధియేటర్లలో సినిమా రిలీజ్.. ఓవరాల్ గా బొమ్మ బావుందంటున్నారు మేకర్స్. నెవర్ బిఫోర్ లుక్ లో అంతకు మించిన ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్న పుష్ప సినిమా ఇప్పటికే అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినా తగ్గేదేలే అంటూ మేకర్స్ ఇంకా ఇంకా అంచనాలను పెంచేస్తున్నారు. తాజాగా సమంతా స్పెషల్ పాటతో ఈ క్రేజ్ ఎక్కడికో చేరింది.

Telugu Film Promotions: టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్.. ఎటు చూసినా ప్రమోషన్ల మోతే..!

సమంతా స్పెషల్ ట్రీట్ అలా వచ్చిందో లేదో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపించింది. కాపీ మ్యూజిక్ అంటూ దేవిశ్రీ మీద ట్రోల్స్ వచ్చినా.. పాటలో మగాళ్లని వంకరబుద్ధి అంటూ మరోలా చూపించారని కొందరు నొచ్చుకున్నా.. పాట మాత్రం సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఇలాంటి హిట్ కాదు సామ్ స్పెషల్ ట్రీట్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో టాక్ తెచ్చుకుంది. స్టార్ హీరోల పాటలకి ధీటుగా ఈ పాట యూట్యూబ్ లో వ్యూస్ తెచ్చుకుంది. ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా అనే పాట ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.

RRR NTR Bike: తారక్ వాడిన బైక్ కథేంటి? దాని ప్రత్యేకతలేంటి?

సమంత స్పెషల్ ట్రీట్ డాన్స్ గా రాబోతున్న ఈ పాటకి యూ ట్యూబ్ లో 22 మిలియన్స్ రావడం విశేషం. వ్యూస్ మాత్రమే కాదు 1 మిలియన్ కి పైగా లైక్స్ వచ్చాయి. సమంతా గ్లామర్ కు చంద్రబోస్ లిరిక్స్ తోడైతే మంగ్లీ చెల్లెలు చంద్రావతి హస్కి వాయిస్ పాటను మరో మెట్టు ఎక్కించేసింది. సహజంగానే సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో స్పెషల్ సాంగ్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక ఈ ఊ కొడతావా మావా.. ఊఊ కొడతావా మావా పాట ఆ పాటలను మించి అదరగొడుతుంది.