RRR NTR Bike: తారక్ వాడిన బైక్ కథేంటి? దాని ప్రత్యేకతలేంటి?

రోజూ ఏదో ఒక కార్యక్రమంతో ఆర్ఆర్ఆర్ టీం సినిమా మీద అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా క్యాప్చర్ చేస్తుంది. సినిమా విడుదలకు కనీసం నెలరోజులు కూడా లేకపోవడంతో టీం మొత్తం ఇప్పుడు ప్రమోషన్..

RRR NTR Bike: తారక్ వాడిన బైక్ కథేంటి? దాని ప్రత్యేకతలేంటి?

Rrr Ntr Bike

RRR NTR Bike: రోజూ ఏదో ఒక కార్యక్రమంతో ఆర్ఆర్ఆర్ టీం సినిమా మీద అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా క్యాప్చర్ చేస్తుంది. సినిమా విడుదలకు కనీసం నెలరోజులు కూడా లేకపోవడంతో టీం మొత్తం ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. కాగా.. తాజాగా ట్రైలర్ ప్రమోషన్ లో తారక్ ధరించిన వాచ్ అందరి చూపు ఆకర్షించగా దాని ధర ఏంటి.. మోడల్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చలు జరగగా కాస్ట్ తెలిసి అంతా ముక్కున వేలేసుకున్నారు. కాగా, ఇప్పుడు మరో అంశం కూడా సోషల్ మీడియాలో తెగ చర్చిస్తున్నారు.

Rrr Ntr Bike

Rrr Ntr Bike

Venkatesh: పాతికేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి వెంకీ.. సల్లుభాయ్‌తో రీ ఎంట్రీ!

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో ఎన్టీఆర్ ఒక బైకును చేత్తో ఆపి పైకి లేపుతాడు. దీనిపై కొంత ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే.. ఈ బైక్ బరువు కేవలం 56 కేజీలే అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. కాగా.. ఇప్పుడు అదే ట్రైలర్ లో ఎన్టీఆర్ నడిపిన బైక్ ఏంటి దాని ప్రత్యేకతలేంటి అనే అంశంపై కూడా తెగ చర్చిస్తున్నారు నెటిజన్లు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా పోస్టర్‌ ట్రైలర్ లో వరకు ఎన్టీఆర్ నడిపిన బైక్ వెలోసెట్ రెట్రో బైక్. ఇది ఏ మోడల్ అని స్పష్టంత లేనప్పటికీ.. ఆ బైక్‌ 1934కు చెందిన ఎమ్‌ సిరీస్ బైక్‌లా కనిపిస్తోంది. సినిమా కోసం బైక్‌లో కొన్ని మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది.

Rrr Ntr Bike1

Rrr Ntr Bike1

Kashish Khan : ‘అనుభవించు రాజా’ హీరోయిన్.. కవ్విస్తున్న కాశిష్‌ఖాన్

అసలు ఈ బైక్ కథేంటి?

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ వాడిన బైక్.. బ్రిటిన్‌కు చెందిన వెలోసెట్ కంపెనీకి చెందిన ఎమ్‌ సిరీస్‌ బైక్‌.
వెలోసెట్‌ ఎమ్‌ సిరీస్‌ బైక్‌ ధర ప్రస్తుతం సుమారు రూ.9 లక్షలుగా ఉంది. అది కూడా వేలం వెబ్‌సైట్‌లోనే కనిపిస్తుంది.

Pushpa : ‘పుష్ప’ ప్రమోషన్స్ చేస్తున్న డేవిడ్ వార్నర్.. తగ్గేదేలే అంటున్న బన్నీ

వెలోసెట్ కంపెనీ చరిత్రేంటి?

హ్యండ్‌మేడ్‌ బైక్‌ల తయారీలో వరల్డ్ ఫేమస్ అయిన వెలోసెట్ కంపెనీ ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చెందింది.
1920 నుంచి 1950 వరకు అంతర్జాతీయ మోటార్ రేసింగ్‌ విభాగంలో ప్రధాన పోటీదారుగా నిలిచింది ఈ కంపెనీ.
తొలుత 1896లో సైకిల్ ఫ్రేమ్‌లు, ఇతర భాగాల తయారీతో మొదలు పెట్టి మోటార్ సైకిళ్ల ఫ్రేమ్‌లు తయారుచేసింది.
1913లో కంపెనీ తన మొదటి టూ-స్ట్రోక్ మోటార్‌ సైకిల్‌ను పరిచయం చేయగా 350 CC, 500 CC బైక్‌లు చేసింది.
ఈ కంపెనీ 500 సీసీ బైక్ ఏకదాటిగా 24 గంటల పాటు గంటకు 161 కిలోమీటర్ల వేగంతో నడిపిన రికార్డు దక్కించుకుంది.
1905లో కంపెనీ తన మొదటి మోటార్‌సైకిల్ వెలోస్‌ను తయారు చేయగా.. 1913లో తొలి బైక్ రోడ్ మీదకి వచ్చింది.
తొలుత కే సిరీస్ బైక్‌ల ధర ఎక్కువగా ఉండటంతో 1934లో ఎమ్‌ సిరీస్ తో ధర తగ్గించి మోడల్ ను తీసుకొచ్చింది.
ఈ బైక్‌ను అప్పట్లో బ్రిటిష్ పోలీసుల కోసం మన దేశానికి దిగుమతి చేసుకోగా నోడీ బైక్ అని కూడా పిలిచేవారు.
ఆ తర్వాత కంపెనీ అనేక కొత్త మోడళ్లతో పాటు పాత మోడళ్లు కూడా చాలాకాలం అందుబాటులో ఉండేవి.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ బైక్స్‌ ప్రాచుర్యం పోదండమే కాకుండా కంపెనీ అనేక సమస్యలను ఎదుర్కొంది.
ఫైనల్ గా ఫిబ్రవరి 1971లో కంపెనీ అధికారికంగా బైక్‌ల ఉత్పత్తిని నిలిపివేయగా ఇప్పుడు కేవలం అప్పటి మోడళ్లే అరుదుగా దొరుకుతున్నాయి.