Pushpa : ‘పుష్ప’ ప్రమోషన్స్ చేస్తున్న డేవిడ్ వార్నర్.. తగ్గేదేలే అంటున్న బన్నీ

'పుష్ప' సాంగ్ ని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇంస్టాగ్రామ్ లో తన ఫేస్ తో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ కి విరాట్ కోహ్లీ..

Pushpa : ‘పుష్ప’ ప్రమోషన్స్ చేస్తున్న డేవిడ్ వార్నర్.. తగ్గేదేలే అంటున్న బన్నీ

David Warner

Pushpa :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్స్ గా రాబోతున్న సినిమా ‘పుష్ప’. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో మూడో సినిమాగా రాబోతుంది. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ ఇందులో ఊర మాస్ క్యారెక్టర్ చేయడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. వీటితో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సినిమాని డిసెంబర్ 17న రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు ఈ టీం.

Akhanda : ‘అఖండ’ కోసం అదిరిపోయే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది ఇతనే..

అయితే ‘పుష్ప’ సాంగ్ ని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇంస్టాగ్రామ్ లో తన ఫేస్ తో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ డేవిడ్ వార్నర్ గురించి తెలిసిందే. తెలుగు స్టార్ల‌ను, హీరోలను ఇమిటేట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. హీరోల ఫేసులకు తన ఫేస్ ని మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తాడు. దీంతో వార్నర్ కి తెలుగులో కూడా అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు వార్నర్. తాజాగా అల్లు అర్జున్ ఫేసుకి తన పేస్ పెట్టి ‘పుష్ప’ సినిమాలోని ‘ఏ బిడ్డ.. ఇది నా అడ్డా..’ సాంగ్ ని పోస్ట్ చేశాడు.

Rajanikanth : ‘పెద్దన్న’ మూవీ డైరెక్టర్ కి సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్ ఇచ్చిన రజినీకాంత్

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వార్నర్ తెలుగు ఫ్యాన్స్ అంతా కామెంట్స్ పెడుతున్నారు ఈ పోస్ట్ కి. అల్లు అర్జున్ అభిమానులు అయితే ఈ వీడియోని షేర్ చేస్తూ తమ హీరో సినిమాని ఇంటర్నేషనల్ క్రికెటర్ ప్రమోట్ చేస్తున్నాడని ఆనందిస్తున్నారు. అంతే కాక ఈ పోస్ట్ కి సెలబ్రిటీలు కూడా కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా కామెంట్ చేయడం విశేషం.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రొమాన్స్ లేదు.. ఓన్లీ బ్రోమాన్స్ మాత్రమే : రాజమౌళి

ఈ పోస్ట్ కి విరాట్ కోహ్లీ.. మేట్ నువ్వు బాగానే ఉన్నావా? అని కామెంట్ పెట్టాడు. ఇక అల్లు అర్జున్.. వార్నర్ భాయ్ తగ్గేదేలే.. అంటూ కామెంట్ పెట్టాడు. ఇలా స్టార్స్ కూడా కామెంట్స్ పెడుతుండటంతో వీడియో బాగా పాపులర్ అవుతుంది. అంతే కాక ‘పుష్ప’ సినిమాకి ఫ్రీగా ప్రమోషన్ కూడా అవుతుంది అని ఆనందిస్తున్నారు సినిమా టీం.