New Movies: ఇక్కడ భీమ్లా.. తమిళంలో వలిమై.. హిందీలో అలియా కలెక్షన్ల మోత!

భీమ్లానాయక్ ఇక్కడ కలెక్షన్ల మోత మోగిస్తుంటే.. కొవిడ్ థర్డ్ వేవ్ తర్వాత కొత్త డేట్ బుక్ చేసుకున్న వలిమై, గంగూబాయ్ సైతం హిట్ టాక్ తెచ్చుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పవన్ అంత..

New Movies: ఇక్కడ భీమ్లా.. తమిళంలో వలిమై.. హిందీలో అలియా కలెక్షన్ల మోత!

New Movies

New Movies: భీమ్లానాయక్ ఇక్కడ కలెక్షన్ల మోత మోగిస్తుంటే.. కొవిడ్ థర్డ్ వేవ్ తర్వాత కొత్త డేట్ బుక్ చేసుకున్న వలిమై, గంగూబాయ్ సైతం హిట్ టాక్ తెచ్చుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పవన్ అంత కాకపోయినా.. తమిళనాడులో అజిత్, నార్త్ లో అలియా ఇప్పుడు థియేటర్స్ లో సత్తా చాటుతున్నారు. కాస్త గ్యాప్ తర్వాత ఎవరి ఇండస్ట్రీకి వారు మంచి బూస్టప్ నిస్తున్నారు.

Valimai: ఆయన వేగాన్ని అందుకోవటం కష్టం.. అజిత్‌పై యంగ్ హీరో కామెంట్స్!

తెలుగు రాష్ట్రాల్లో భీమ్లానాయక్ రికార్డ్ బద్దలు కొడుతుంటే.. కోలీవుడ్ లో అజిత్ వలిమైతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. 34కోట్ల గ్రాస్ ఫస్ట్ డే కలెక్షన్స్ తో ఆల్ టైమ్ నంబర్ వన్ గా నిలిచాడు అజిత్. బైక్ ఛేజింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ తో వలిమై ఆడియెన్స్ కు పవర్ఫుల్ ట్రీట్ ఇస్తోంది. తెలుగు హీరో కార్తికేయ విలన్ గా నటించిన వలిమై మొత్తానికి తమిళనాట బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Gangubai Kathiawadi: గంగూబాయ్ ట్రైలర్ వచ్చేసింది.. వేశ్య పాత్రలో అలియా నట విశ్వరూపం!

తగ్గేదే లే అంటోంది గంగూబాయ్ కతియావాడి. కోలీవుడ్ లో వలిమై, టాలీవుడ్ లో బీమ్లానాయక్ సూపర్ అనిపించుకుంటే.. నార్త్ లో జోరు చూపిస్తోంది అలియా భట్. చూసిన వాళ్లందరూ పాజిటివ్ రివ్యూస్ తో సంజయ్ లీలా భన్సాలీ సినిమాను పొగడ్తలతో మోసెస్తున్నారు. ముఖ్యంగా యంగ్ ట్యాలెంట్ అలియా భట్.. గంగూబాయ్ గా ఇరగదీసిందంటున్నారు ఆడియెన్స్. కామటిపురా రాణి.. సెక్స్ వర్కర్ గంగూగా అలియా ఏంటని ప్రశ్నించిన వారికి గట్టి సమాధానం ఇచ్చింది ఈ హీరోయిన్.