Valimai: ఆయన వేగాన్ని అందుకోవటం కష్టం.. అజిత్‌పై యంగ్ హీరో కామెంట్స్!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో ‘వలిమై’తో వస్తున్నాడు. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 24న వలిమై రిలీజ్ కానుంది.

Valimai: ఆయన వేగాన్ని అందుకోవటం కష్టం.. అజిత్‌పై యంగ్ హీరో కామెంట్స్!

Valimai

Valimai: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో ‘వలిమై’తో వస్తున్నాడు. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 24న వలిమై రిలీజ్ కానుంది. వలిమైలో తెలుగు యంగ్ హీరో కార్తికేయ నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా అభిమానులను ఎంతగానో అట్రాక్ట్ చేసింది.

Valimai: ప్రోమోకు పెయిడ్ లైక్స్.. నెట్టింట యాంటీ ఫాన్స్ దుమారం!

అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీన్లు డిజైన్ చేయడంతో సినిమా కోసం అజిత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టిన వలిమై టీం తెలుగులో కార్తికేయ ఇమేజ్ ను కూడా వాడుకుంటుంది. హీరో అజిత్ కి తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉండగా కార్తికేయ ఇమేజ్ కూడా తోడుచేసి సినిమా మీద హైప్ పెంచాయలని చూస్తున్నారు.

Valimai: పాన్ ఇండియా క్రేజ్.. నార్త్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన అజిత్!

ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కార్తికేయ అజిత్ డెడికేషన్, ఫ్యాషన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వలిమై షూట్, అజిత్ తో జర్నీ తనకు ఎన్నో విలువైన విషయాల్ని తెలిపిందన్న కార్తికేయ.. పని పట్ల ఆయనకున్న నిబద్ధతను మాటల్లో చెప్పలేమని.. ఈ సినిమా షూటింగ్ లో రేసింగ్ ఎపిసోడ్స్ లో ప్రమాదం జరిగిందని.. పెద్ద దెబ్బలే తగిలినా.. ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్ కంప్లీట్ చేశారని చెప్పాడు.

Valimai Trailer : అజిత్ మాస్+డైరెక్టర్ బ్రెయిన్= మైండ్ బ్లోయింగ్ ట్రైలర్..

అంత రిస్కు ఎందుకు.. రెండు రోజులు రెస్టు తీసుకోవచ్చుగా అంటే.. ఆ రెండు రోజులు మిగతా వాళ్ళ డేట్స్.. లొకేషన్ ఖర్చులు ఎందుకు? అందరికీ ఇబ్బందే. నేనే కాస్త ఓపిక పడితే సరిపోతుంది కదా అని చెప్పారట. పని పట్ల ఎంతటి కమిట్ మెంట్ ఉండాలో ఆయన్ను చూస్తే అర్థమైందన్న కార్తికేయ.. స్వతహాగా అజిత్ రేసర్ కావటంతో.. సెట్లో ఆయన వేగాన్ని అందుకోవటం తనకు కష్టమైందని చెప్పాడు.