Valimai Trailer : అజిత్ మాస్+డైరెక్టర్ బ్రెయిన్= మైండ్ బ్లోయింగ్ ట్రైలర్..

‘తల’, ‘అల్టిమేట్ స్టార్’ అజిత్ కుమార్ ‘వలిమై’ ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది..

Valimai Trailer : అజిత్ మాస్+డైరెక్టర్ బ్రెయిన్= మైండ్ బ్లోయింగ్ ట్రైలర్..

Valimai Trailer

Valimai Trailer: కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ కుమార్ ‘నేర్కొండ పార్వై’ (పింక్ రీమేక్) తర్వాత వెంటనే నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు హెచ్. వినోద్‌లతో కలిసి ‘వలిమై’ సినిమా చేస్తున్నారు.. అజిత్ నటిస్తున్న 60వ సినిమా ఇది.. బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి ఫీమేల్ లీడ్.

Valimai : ‘భీమ్లా నాయక్’ తర్వాత రోజే ‘తల’ అజిత్ సినిమా!

టాలీవుడ్ హీరో ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. అజిత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వలిమై’ ట్రైలర్ గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన నిమిషాల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్, లైక్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోందీ ట్రైలర్.

Kartikeya

అజిత్ మరోసారి తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశారు. స్టైలిష్ అండ్ ఇంటిలిజెంట్ కాప్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నారాయన. యాక్షన్ సీన్స్ అయితే గూస్ బంప్స్ అనే చెప్పాలి. బేసిక్‌గా రైడర్ అయిన అజిత్.. బైకులతో బీభత్సంగా ఆడేసుకున్నారు.

Thala Ajith Kumar : ముచ్చటగా మూడోసారి.. ‘వలిమై’ విడుదలకు ముందే ‘తల’ 61 ప్రారంభం..!

కార్తికేయ క్రూషియల్ విలన్‌గా సరికొత్తగా కనిపించాడు. నిరవ్ షా విజువల్స్, యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్స్ సింప్లీ సూపర్బ్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2022 సంక్రాంతి కానుకగా ‘వలిమై’ విడుదల కానుంది.