Arjun : హీరో అర్జున్‌కి కరోనా పాజిటివ్

తాజాగా సీనియ‌ర్ హీరో, న‌టుడు అర్జున్ స‌ర్జాకు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ఈ విషయంపై అర్జున్.......

Arjun : హీరో అర్జున్‌కి కరోనా పాజిటివ్

Arjun

Arjun :  గతంలో కరోనా మొదటి వేవ్ లో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా అన్ని భాషల సినీ పరిశ్రమలలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. స్టార్లు సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు. కొంతమంది ఆర్టిస్టులు కరోనాతో మరణించడం బాధాకరం. ఇటీవల మళ్ళీ కరోనా విజృభిస్తుండటంతో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది సెలబ్రిటీలు మళ్ళీ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కమల్ హాసన్ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న స్టార్ హీరోయిన్స్ కరీనా కపూర్, అమృత అరోరాలకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా మరో హీరో కరోనా బారిన పడ్డాడు.

Jahnvi Kapoor : జాన్వీ కపూర్ చేతికి ఏమైంది? ఆందోళనలో అభిమానులు..

తమిళ్, తెలుగు, కన్నడ సినిమాల్లో స్టార్ డం సంపాదించిన సీనియ‌ర్ హీరో, న‌టుడు అర్జున్ స‌ర్జాకు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ఈ విషయంపై అర్జున్ ఇంస్టాగ్రామ్ లో… ‘‘కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వెంటనే నేను తగిన చర్యలు తీసుకుని ఐసోలేషన్‌కి వెళ్లాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారు, నా దగ్గరి వాళ్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ జాగ్రత్తలు తీసుకోండి. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించడం మర్చిపోకండి’’ అని పోస్ట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు అర్జున్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.