Jahnvi Kapoor : జాన్వీ కపూర్ చేతికి ఏమైంది? ఆందోళనలో అభిమానులు..

ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఆ స‌మ‌యంలో జాన్వీ క‌పూర్ చేతికి క‌ట్టు ఉండటం క‌నిపించింది. ఆమె చేతికి గాయం అయిందని, అందుకే డాక్టర్స్ అలాంటి కట్టు......

Jahnvi Kapoor : జాన్వీ కపూర్ చేతికి ఏమైంది? ఆందోళనలో అభిమానులు..

Jahnvi

Jahnvi Kapoor :  శ్రీదేవి కూతురిగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది జాన్వీ కపూర్. ఒక పక్క సినిమాలతో అభిమానులని మెప్పిస్తూ, మరో పక్క సోషల్ మీడియాలో తన అందాలతో ఫాలోయింగ్ పెంచుకుంటుంది. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గను అంటూ సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది. ఇటీవల ‘రూహీ’ సినిమాతో పలకరించినా ఆ సినిమా పరాజయం పాలయింది.

తాజాగా జాన్వీ క‌పూర్ విమానాశ్ర‌యం నుండి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా ఫొటోగ్రాఫ‌ర్స్ కి చిక్కింది. ఆమెని తమ కెమెరాల్లో బంధించారు ఆక్కడి ఫోటో గ్రాఫర్స్. అయితే ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఆ స‌మ‌యంలో జాన్వీ క‌పూర్ చేతికి క‌ట్టు ఉండటం క‌నిపించింది. ఆమె చేతికి గాయం అయిందని, అందుకే డాక్టర్స్ అలాంటి కట్టు వేశారని తెలుస్తుంది.

PV Narasimharao : హాఫ్ లయన్.. పీవీ నరసింహారావుపై వెబ్ సిరీస్.. ‘ఆహా’లో

అయితే గాయం ఎలా అయింది? అంత పెద్ద కట్టు ఎందుకు? అనే ప్రశ్నల్ని అప్పుడే అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్, విలేకరులు అడిగినా సమాధానం ఇవ్వకుండా జాన్వీ వెళ్ళిపోయింది. ఆ తర్వాతి రోజు కూడా మరో చోట ఇలాగే కట్టుతో కనపడేసరికి జాన్వీ చేతికి ఏమైంది అంటూ అభిమానులు ఆందోళనతో సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీనిపై జాన్వీ కూడా ఏమి మాట్లాడకపోవడంతో ఏం జరిగిందో తెలుసుకోవాలని నెటిజన్లు, అభిమానులు మరింత ఆసక్తితో ఉన్నారు.