PV Narasimharao : హాఫ్ లయన్.. పీవీ నరసింహారావుపై వెబ్ సిరీస్.. ‘ఆహా’లో

భారతదేశ స్థితిగతుల్ని మార్చేసిన పీవీ తీరుపై గతంలో వినయ్ సీతాపతి ‘హాఫ్ లయన్’ అనే పుస్తకం రాశారు. ఇప్పుడు ఆ పుస్తకం ఆధారంగా పీవీ బయోపిక్ ని వెబ్ సిరీస్ రూపంలో...........

PV Narasimharao : హాఫ్ లయన్.. పీవీ నరసింహారావుపై వెబ్ సిరీస్.. ‘ఆహా’లో

Pv

PV Narasimharao :  తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి ప్రధాని పీఠం అధిష్టించిన వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఆయన తర్వాతి రాజకీయ నాయకులకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. పీవీ నరసింహారావు దేశంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. గతంలో కొంతమంది పీవీ నరసింహారావు బయోపిక్ ని అనౌన్స్ చేసినా అవేవి కార్యరూపం దాల్చలేదు. తాజాగా పీవీ నరసింహారావుపై వెబ్‌ సిరీస్‌ రాబోతుంది.

భారతదేశ స్థితిగతుల్ని మార్చేసిన పీవీ తీరుపై గతంలో వినయ్ సీతాపతి ‘హాఫ్ లయన్’ అనే పుస్తకం రాశారు. ఇప్పుడు ఆ పుస్తకం ఆధారంగా పీవీ బయోపిక్ ని వెబ్ సిరీస్ రూపంలో తీసుకు రాబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు ప్రకాష్ ఝ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఇవాళ ఉదయం ఈ వెబ్ సిరీస్ అనౌన్స్మెంట్ కార్యక్రమం జరిగింది.

Meera Mithun : షూటింగ్ లోంచి పారిపోయిన హీరోయిన్.. కథ మార్చేసిన డైరెక్టర్

హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ ని తెరకెక్కించనున్నారు. పీవీ వెబ్ సిరీస్‌ను ఆహా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మించబోతున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో 2023లో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. అయితే తెలుగులో మాత్రం ఆహలోనే స్ట్రీమ్ అవుతుంది. మరి వేరే భాషల్లో వేరే ఓటిటిలకు ఇస్తారా లేక ఆహాలోనే రిలీజ్ చేస్తారా చూడాలి.