Karthikeya 2 : సీరియల్లో ఎంట్రీ ఇచ్చిన హీరో నిఖిల్.. ప్రమోషన్స్ లో కొత్త స్టంట్..
కార్తికేయ 2 ప్రమోషన్ కోసం జీ తెలుగులో ప్రసారమయ్య పాపులర్ డైలీ సీరియల్ రాధమ్మ కూతురు ఎపిసోడ్లో ప్రత్యక్షమయ్యాడు నిఖిల్. ఇందులో ఓ సీన్ లో ప్రత్యక్షమై ఫైట్ చేశాడు, కొన్ని డైలాగ్స్ కూడా...........
Karthikeya 2 : నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 రాబోతుంది. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కార్తికేయ 2 సినిమాని తెరకెక్కించారు. ఈ సారి సినిమాని మరింత కొత్త కథతో, మరింత సస్పెన్స్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్ర యూనిట్.
Star Hero’s : సినిమాల కోసం జిమ్లో కష్టాలు పడుతున్న స్టార్ హీరోలు
కార్తికేయ 2 శాటిలైట్, ఓటీటీ హక్కులని ముందుగానే జీటీవీ కొనడంతో సరికొత్త ప్రమోషన్స్ కి తెరలేపారు. జీటీవిలో ప్రసారమయ్యే సీరియల్స్ లో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇందుకోసం స్వయంగా హీరో నిఖిల్ రంగంలోకి దిగాడు. కార్తికేయ 2 ప్రమోషన్ కోసం జీ తెలుగులో ప్రసారమయ్య పాపులర్ డైలీ సీరియల్ రాధమ్మ కూతురు ఎపిసోడ్లో ప్రత్యక్షమయ్యాడు నిఖిల్. ఇందులో ఓ సీన్ లో ప్రత్యక్షమై ఫైట్ చేశాడు, కొన్ని డైలాగ్స్ కూడా చెప్పాడు. ఇలా సీరియల్ లో కనపడి అందరికి షాకిచ్చాడు నిఖిల్. దీంతో లేడీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయొచ్చని ప్లాన్ చేశారు. నిఖిల్ ఈ ఎపిసోడేకి సంబంధించిన ప్రోమోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.
Going All Out Promoting Karthikeya2 Guest Appearing in Top Zee Tv Serials… Catch Me as Dr.Karthikeya in the Top Rated Tv Serial #RadhammaKuthuru #Karthikeya2onAugust12th
@anupamahere @AnupamPKher @Actorysr @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @zeecinemalu pic.twitter.com/QKEKUFeW3U— Nikhil Siddhartha (@actor_Nikhil) July 22, 2022